బంగారం ధర భగభగ.. ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

బంగారం ధర భగభగ.. ఎంతంటే?

March 2, 2022

06

రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య గత వారం రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా పసిడి, వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. బంగారం, వెండి ధరలు పోటీ పడి జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేస్తున్నాయి. మంగళవారం రోజున రూ. 50,950తో ముగిసిన బంగారం ధర ఈరోజు ఉదయం రూ. 1,090 పెరిగి రూ. 52,040కు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే, తాజాగా రూ. 2,200 రూపాయలు పెరిగి రూ. 67,200కు చేరింది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక హైదరాబాద్‌లో పసిడి ధర చూస్తే.. 22 కేరట్ల పసిడి ధర రూ. 47,700 పలుకగా 24 కేరట్ల బంగారం ధర రూ. 52,040గా ఉంది. ఉక్రెయిన్,రష్యా దేశల మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్తతలతో డాలర్ ఇండెక్స్ కనిష్ఠానికి పడిపోయింది. దీంతో బులియన్ మార్కెట్ పరుగులు పెడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.