Home > Business Trends > Tata Harrier, Safari:టాటా మోటార్స్ నుంచి సరికొత్త కార్లు రిలీజ్…ధర ఎంతో తెలుసా..!!

Tata Harrier, Safari:టాటా మోటార్స్ నుంచి సరికొత్త కార్లు రిలీజ్…ధర ఎంతో తెలుసా..!!

What is the release price of new Tata Harrier and Safari cars from Tata Motors?

ప్రముఖ భారత కంపెనీ టాటా మోటార్స్ రెండు సరికొత్త మోడల్ కార్లను విడుదల చేసింది. టాటా హారియర్, సఫారి అన్ని అప్ డేట్స్ తోపాటు రెండు ఎస్‎యూవీల ధరలను ప్రకటించింది. అప్ డేట్ చేసిన 2023 టాటా హారియర్ ఎస్‎యూవీ ధర రూ. 15లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా సఫారి ఎస్ యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.65 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

రెగ్యులర్ వేరియంట్ కోసం 2023 టాటా హారియర్ ధర రూ. 15 లక్షల నుండి రూ. 24.07 లక్షల వరకు ఉంటున్నట్లు కంపెనీ తెలిపింది. రెడ్ డార్క్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.77 లక్షలుగా ఉంది. మరోవైపు, అప్ డేట్ చేసిన టాటా సఫారీ ఎస్‎యూవీ ధర రూ. 15.65 లక్షల నుండి రూ. 25.01 లక్షల వరకు ఉంటుంది. రెడ్ డార్క్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.22.61 లక్షలు.

ఇక డిజైన్ పరంగా చూసినట్లయితే రెండు SUV లకు పెద్దగా మార్పులు ఏం చేయలేదు. అయితే, ఈ SUVల ఇంటీరియర్‌లకు సరికొత్త ఫీచర్లను జోడించారు. టాటా హారియర్ , సఫారి , నవీకరించిన రెగ్యులర్ వేరియంట్‌లు భద్రత పరంగా ఇంతకుముందు కంటే చాలా మెరుగ్గా ఉంది. అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ , 6 ఎయిర్ బ్యాగ్‌లు, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరాతో సహా అన్ని తాజా ఫీచర్లు వీటిలో పొందవచ్చు. ఇవే కాకుండా కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, 7.0-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు అనేక ఇతర హైటెక్ కార్ టెక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

టాటా హారియర్ , సఫారి , రెగ్యులర్ వేరియంట్‌లు పాత 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. అయితే, ఈ రెండు SUVల , సాధారణ వేరియంట్‌ల ఇంజన్‌లు నవీకరించారు . అప్ డేట్ చేసిన వేరియంట్ BS6 ఫేజ్-2 RDE (రియల్-డ్రైవ్ ఎమిషన్) ఆధారిత ఇంజన్ తో రన్ అవుతుంది. ఈ రెండు మధ్య-పరిమాణ SUVలు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో శక్తిని పొందుతాయని కంపెనీ తెలిపింది. వీటిలో అమర్చిన ఇంజన్ 167 బిహెచ్‌పి పవర్ , 350 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Updated : 27 Feb 2023 11:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top