What is this ‘invisible’ bicycle wheel optical illusion that has left netizens perplexed
mictv telugu

ఈ సైకిల్‌కు ముందు చక్రం ఉందో, లేదో చెప్పండి!

August 12, 2022

What is this ‘invisible’ bicycle wheel optical illusion that has left netizens perplexed

సోషల్ మీడియాలో నిత్యం కొన్ని ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఆహ్లాదకరంగా, ఆకట్టుకునేలా ఉంటాయి. ఇవి చూడటానికి మంచిగా ఉన్నప్పటికీ.. సరికొత్త విషయాలతో మనల్నే ఆశ్చర్యపరుస్తాయి. ఉన్నా.. లేనట్టుగా, ఏదో కనికట్టులా మన కళ్లన్ని మెదడును తిమ్మిరి బమ్మిని చేస్తుంటాయి. ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్‌లు మనం చూసే వాటికి భిన్నంగా ఉంటాయి. మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా..? అనిపించేలా ఈ చిత్రాలు ఉంటాయి. తాజాగా, ఓ ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ నెటిజన్లు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

పైన కనిపిస్తోన్న ఫోటోలో ఓ సైకిల్ ఏదో పొలం పక్కన ఆపినట్లు , దానికి ముందు చక్రం లేనట్లుగా ఉంది. ఇది కొన్ని రోజులుగా ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఫొటో గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. ఆన్ లైన్ చర్చా వేదిక అయిన రెడ్ ఇట్ వెబ్ సైట్లో ఓ నెటిజన్ ఈ ఫొటోను పోస్ట్ చేయడంతో ఈ గందరగోళం మొదలైంది. మరి నిజానికి ఈ సైకిల్ కు ముందు చక్రం ఉంది. జాగ్రత్తగా గమనిస్తే.. కనిపిస్తుంది.

ఈ సైకిల్ ను తీసుకుని బురదలో ప్రయాణించిన వ్యక్తి దాన్ని ఓ చోట ఆపారు. బురదలో వెళ్లడంతో సైకిల్ ముందు టైరుకు పూర్తిగా అంటుకుని ఉంది. అయితే సైకిల్ టైరుకు అంటిన బురద మట్టిలాంటి మట్టి ఉన్న చోట దానిని ఆపారు. ముందు చక్రాన్ని సూటిగా ఉంచి, రెండు వైపులా ఉన్న ఇనుప పైపులకు సమాంతరంగా వచ్చేలా చూసి.. ఫొటో తీశారు. అందువల్ల టైరుకు అంటిన బురద కింద ఉన్న మట్టిలో కలిసిపోయి.. ఆప్టికల్ ఇల్యూషన్ ఏర్పడింది. ఇలాంటి ఫొటోలను మెదడు ప్రాసెస్ చేసేప్పుడు దాదాపు సరిసమానంగా ఉన్న రంగులను కలిపి చూస్తుందని.. అందువల్ల ఒకే రంగులో ఉన్నవన్నీ ఒకే వస్తువులా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ముందు చక్రం టైరు మనం గమనించలేకుండా.. కింద నేలలో కలిసిపోయినట్టు కనిపిస్తుందని వివరిస్తున్నారు.