Exit Poll: త్రిపుర-నాగాలాండ్‎ బీజేపీదే..మేఘాలయలో హంగ్ ఫైట్..!! - MicTv.in - Telugu News
mictv telugu

Exit Poll: త్రిపుర-నాగాలాండ్‎ బీజేపీదే..మేఘాలయలో హంగ్ ఫైట్..!!

February 28, 2023

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలండ్, మేఘాలయకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. యాక్సిస్ మై ఇండియా, ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్స్ లో త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ విజయం సాధిస్తుందని పలు సంస్థలకు చెందిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. మేఘాలయలో మాత్రం ఈసారి హంగ్ ఏర్పడనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

త్రిపుర ఎన్నికలు:

త్రిపుర బీజేపీ మరోసారి విజయకేతనం ఎగురవేస్తుంది. లెఫ్ట్-కాంగ్రెస్ ఒక విధంగా తుడిచిపెట్టుకుపోతాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 36 నుంచి 45 సీట్లు బీజేపీ కైవసం చేసుకోనుంది. వామపక్ష కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే చాన్స్ లేదు. 9 నుంచి 11 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. తిప్రా మోతా పార్టీ 9 నుంచి 16స్థానాల్లో విజయం సాధిస్తుందన్న అంచనా వేశారు.

తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించి త్రిపురలో రెండోసారి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ 55స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. దాని కూటమని ఐపీఎఫ్టీ ఆరు స్థానాల్లో అభ్యర్థులను నిలపగా..ఒక స్థానంలో కూటమి పార్టీల మధ్య స్నేహపూర్వకపోటీ ఉంది. మరోవైపు సీపీఎం 47చోట్ల, కాంగ్రెస్ 13చోట్ల బరిలోకి దిగాయి. మాజీ రాజకుటుంబ వారసుడు ప్రద్యోత్ దేబ్ బర్మ్ త్రిపా మోతా పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన 42స్ధానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపారు. కాంగ్రెస్ -సీపీఎం కూటమి,తిప్రా మోతా పార్టీల నుంచి బలమైన పోటీ ఉన్నప్పటికీ త్రిపురలో బీజేపీ విజయం సాధిస్తుందన్న దీమాలో ఆ పార్టీ ఉంది. 2018 ముందు వరకు త్రిపురలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ , సీపీఎంలు…ఈసారి ఎలాగైనా త్రిపురలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్నాయి.

నాగాలాండ్ ఎన్నికలు:

నాగాలాండ్ లో కూడా బీజేపీ అధికారం కైవసం చేసుకునేట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ ఎన్పీపీ కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కూటమికి 38 నుంచి 48సీట్లు, కాంగ్రెస్ 1 నుంచి 2, ఎన్పీఎఫ్ కు 3 నుంచి 8 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. నాగాలాండ్ సీఎం నిఫియు రియోకు ఉన ఆదరణ ఈ ఎన్నికల్లో కూడా చెక్కుచెదరలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు 25శాతం మంది సీఎంవైపే చూపిస్తున్నాయి.

మేఘాలయ ఎన్నికలు:

త్రిపుర పరిస్థితి నాగాలాండ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మేఘాలయలో హంగ్ వైపే ఎగ్జిట్ పోల్స్ మొగ్గుచూపాయి. ఏ పార్టీకి మెజార్టీ స్పష్టంగా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. మేఘాలయలో ఎన్ పీపీకి 18 నుంచి 24, బీజేపీకి 4 నుంచి 8, కాంగ్రెస్ కు 6 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 21 సీట్లతో అధికారంలోకి వచ్చింది.