అంకాపూర్ ,లక్ష్మాపూర్ ల కథ ఏందో ? కేసీఆర్ ఏం జెప్పిండో ? - MicTv.in - Telugu News
mictv telugu

అంకాపూర్ ,లక్ష్మాపూర్ ల కథ ఏందో ? కేసీఆర్ ఏం జెప్పిండో ?

August 4, 2017

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం లక్ష్మా పూర్  గ్రామ సభలో కేసీఆర్ పర్యటించారు,గ్రామస్తుల సమస్యలన్నీ తీరుస్తాం..అని హామీ ఇచ్చారు.గ్రామాల్లో గొప్పగ బ్రతకచ్చు,కానీ బ్రతుకుతలేము.నిజాబాద్ జిల్లా అంకాపూర్ ఊరులో ఉన్న భూములు  అంత గొప్పవేం కాదు అయినా బంగారం పండుతుంది.అక్కడ వ్యవసాయం బాగా అభివృద్ది చెందింది…1987ల నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఓసారి అంకాపూర్ పోయిన అక్కడ అప్పటికే మూడు బ్యాంకులు ఉన్నాయి.అందులో దగ్గరి దగ్గర 27 కోట్ల రూపాయలను పబ్లిక్ అక్కడ పొదుపు జేస్కున్నరు..అంటే సూడున్రి వాళ్లు అంత అభివృద్ది కానీకి కారణం..పొదుపు,అదిగుడ ఆడోళ్లతోనే సాధ్యం,ఎందుకంటే అక్కడ మొగవాళ్లు సిగరెట్ తాగాలన్నా సిగరెట్ కూడా ఆడోళ్లే పైసలియ్యాలే.అందుకే అంకాపూర్ ను అందరు ఆదర్శంగా తీస్కోవాలే అని సీయం చెప్పారు.

లక్ష్మీపురంలో లక్ష్మీదేవి తాండవించాలె.మోటు మాటలు బంజెయ్యున్రి ,అందరు ఓలనొగలు తిట్టుకునుడు బంజెయ్యాలే,ప్రేమగ పలకరిచ్చుకోవాలే,అందరు సంస్కారంతోని ఉండాలే ఓల కష్టాలు ఓలు తెల్సుకోవాలే,అని కేసీఆర్ అన్నారు.అంతేకాదు మీరందరు మంచిగుంటే ఊర్ల పోలీసోల్ల అవుస్రం గుడలేదు,గోదావరి నీళ్లను తెచ్చి లక్ష్మాపూర్ చెరువు నింపుతం.మిషన్ కాకతీయ లో లక్ష్మాపూర్ కట్టను వెడల్పు చేస్తాం.అంతే కాదు  75 లక్షలతోని విలేజ్ మల్టీ పర్పస్  కమ్యూనిటీ హాల్ ను కట్టుకుందాం,మహిళలు.. మహిళా గ్రూపులు,మీటింగులు వెట్టుకోనికి30 లక్షలు వెట్టి మహిళా భవన్ కట్టుకుందాం, గ్రామ రూపు రేఖలు మారిపోవాలి.ఆరునెలల్లో అన్ని పనులు ఖచ్చితంగా పూర్తయితయ్.వచ్చే సంవత్సరం నుంచి ఎకరానికి 8000 రైతుల అకౌంట్లలో వేస్తాం.500 కోట్లతో రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు జేశి డైరెక్టు రైతు పండించిన దాన్యాన్ని కొంటాం, రైతుల పరిస్ధితి ఊపర్ షేర్వాణీ ,అందర్ పరేషానీ అన్నట్టే ఉంది.

బిబిసీ చానల్ అనే ఇంగ్లీషు చానల్ చూస్తా, ఇక్కడనే కాదు ప్రపంచ మొత్తం మీద రైతు పరిస్ధితి దయనీయంగనే ఉన్నది. సమైక్య రాష్ట్రంల జీవితం కొల్పోయినం, ఉన్న జీవితాన్ని కోల్పోతూ ఇంకా ఎక్కన్నో వెత్కుతున్నం…ఇప్పటికైతె లక్ష్మాపూర్ గ్రామానికి 100 డబుల్ బెడ్రూం ఇండ్లను సాక్షన్ జేస్తున్నం అని అన్నారు కేసీఆర్.