‘What will you call this tax’: Video showing elephants being fed sugarcane goes viral
mictv telugu

ఏనుగుల దందా.. నడిరోడ్డుపై నిలబెట్టి మరీ…

July 25, 2022

మామూలుగా ఏదైనా రహదారి గుండా వెళ్లేటప్పుడు టోల్ గేట్ దగ్గర తప్పనిసరిగా ట్యాక్స్ చార్జీలు చెల్లించాలి. లేదంటే వాహనాలను ఆపి అధికారులు ట్యాక్స్ వసూలు చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏనుగులు ట్యాక్స్ వసూలు చేయడం మీరెప్పుడైనా చూశారా..? ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వేలాది మంది నెటిజన్లు ఏనుగులను చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ నిత్యం తన ట్విటర్ ఖాతాలో జంతువులకు సంబంధించిన పలు ఆశ్చర్యకరమైన వీడియోలను పోస్టు చేస్తుంటారు. తాజాగా ఏనుగులు లారీని ఆపి చెరకు గడలు తీసుకెళ్తున్న వీడియోను పోస్టు చేశారు. ‘మీరు ఇలాంటి పన్ను వసూలును ఏమని పిలుస్తారు’ అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.

ఈ వీడియోలో తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు అటవీ ప్రాంతంలో రహదారిపై చెరకు లోడుతో వెళ్తున్న లారీకి అడ్డంగా నిలబడి నిలిపేసినట్లు కనిపిస్తుంది. వీటిని గమనించిన లారీ డ్రైవర్ వెంటనే చెరకు లోడుపైకి ఎక్కి కొన్ని చెరకు గడలను కిందపడేయడం వీడియోలో చూడొచ్చు. అప్పుడు ఆ ఏనుగులు కిండపడేసిన చెరకు గడలను తొండంతో పట్టుకొని అడవిలోకి వెళ్లిపోతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఏనుగుల తీరును చూసి ఆశ్చర్యపోతున్నారు.