తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మరో ముందడుగు వేసింది. మంగళవారం కేసీఆర్ హైదరాబాద్ నగరంలోని కొత్తపేట(ఎల్బీనగర్), ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్(సనత్ నగర్), అల్వాల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు భూమి పూజలు చేశారు. ఈ నేపథ్యంలో అల్వాల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుకి శంకుస్థాపన చేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ..”రాష్ట్రంలో వైద్య విధానాన్ని మరింత పటిష్ట పరుస్తాం. హైదరాబాద్‌కు నలు దిక్కులా అందుబాటులో వైద్య సేవలు అందిస్తాం.
గ్రామీణ ఆస్పత్రుల్లో పడకలు, సదుపాయాలు పెంచాం. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో ఆరువేల పడకలు పెంచబోతున్నాం. అంతేకాదు మృతదేహాల తరలింపునకు ప్రత్యేక ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేయిస్తాం” అని కేసీఆర్ అన్నారు.
అంతేకాకుండా కొందరు మతం, కులం పేరుపై చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. మతం అనేది ఓ క్యాన్సర్ అని, ఆ క్యాన్సర్ బారిన పడితే ప్రమాదంలో పడిపోతామని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. కొన్ని మతాలకు చెందిన వారి దుకాణాల్లో కొనవద్దని కొందరు చెప్తున్నారు. కర్ఫ్యూలు, ఫైరింగ్‌లు పెడితే హైదరాబాద్‌కు ఎవరూ రారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. విదేశాల్లోని 13 కోట్ల మంది భారతీయులను బయటికి పంపిస్తే, పరిస్థితి ఏమిటి? అని, అందుకే సామరస్యంగా ఉండాలని కేసీఆర్ అన్నారు.