ఏం తమాషాగా ఉందా?: అమెరికా - MicTv.in - Telugu News
mictv telugu

ఏం తమాషాగా ఉందా?: అమెరికా

March 1, 2022

tha

గత ఆరు రోజులుగా ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధాన్ని ఆపడానికి సోమవారం ఇరు దేశాల విదేశాంగ శాఖ‌ల‌కు చెందిన ప్ర‌తినిధి బృందాలు సమావేశం అయిన ఒప్పందాలు కుదరకపోవటంతో చర్చలు విఫలం అయ్యాయి. ఈ సందర్భంగా పాశ్చత్య దేశాలు రష్యాను అంతర్జాతీయంగా ఒంటరిని చేయాలని, గట్టిగా బుద్ది చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి. ఆంక్షల మీద ఆంక్షలు, నిషేధాల మీద నిషేధాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఈ తరుణంలో రష్యాకు నేరుగా వార్నింగ్‌ ఇస్తున్న అమెరికా.. ఇప్పుడు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న బెలారస్‌ను కాస్త గట్టిగానే హెచ్చరించింది. “ఏం తమాషాగా ఉందా..? పుతిన్‌కు మద్ధతు ఇవ్వడం ఏంటి..? ఉక్రెయిన్‌పై పుతిన్ దురాక్రమణకు అలెగ్జాండర్‌ లుకషెంకో(బెలారస్‌ అధ్యక్షుడు) మద్దతు విషయంలో ఇలాగే కొనసాగిస్తే బాగోదు. లేదు ఇలాగే ఉంటా అంటే గనుక మునుముందు బెలారస్ తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది” అంటూ అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ హెచ్చరికలు జారీ చేశారు.