వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్స్‌.. కొత్త ఫీచర్‌తో సరికొత్త అనుభూతి - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్స్‌.. కొత్త ఫీచర్‌తో సరికొత్త అనుభూతి

July 13, 2020

Whatsapp

తన వినియోగదారులను అలరించడానికి వాట్సప్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. తాజాగా యూజర్లకు మరో సరికొత్త ఫీచర్‌ను అదించింది.  ఇప్పటికే స్టిక్కర్స్ ఫీచర్ ఉండగా.. దానికి మరిన్ని మెరుగులు దిద్ది కొత్తగా యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని పరిచయం చేసింది. మీ మొబైల్‌లో ఈ యానిమేటెడ్ స్టిక్కర్ ఫీచర్ అందుబాటులోకి రావాలంటే.. ముందుగా మీ వాట్సప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లు 2.20.194.7 వర్షన్, ఐఓఎస్ యూజర్లు 2.20.70.26 వర్షన్‌ అప్‌డేట్ చేసుకోవాలి. అప్పుడే మీకు యానిమేటెడ్ స్టిక్కర్స్ యాప్‌లో దర్శనమిస్తాయి. ఈ యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని ఇతరులకు పంపడం మాత్రమే కాదు సేవ్ కూడా చేసుకునేలా రూపొందించారు. థర్డ్ పార్టీ యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని ప్లేస్టోర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ స్టిక్కర్స్ వాట్సప్ వెబ్ యాప్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. వాట్సప్ యాప్‌లో యానిమేటెడ్ స్టిక్కర్ ఫీచర్ ఎలా వాడుకోవాలో తెలుసుకుందామా.

ముందుగా మీ వాట్సప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేయాలి.
ఎవరిదైనా ఛాట్ ఓపెన్ చేసి ఎమోజీ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీకు ఎమొజీ, GIF, స్టిక్కర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో స్టిక్కర్ ఆప్షన్ ఎంచుకోండి. మీకు లిస్టులో Rico’s Sweet Life, Playful Piyomaru, Bright Days, Moody Foodies, Chummy Chum Chums పేర్లతో స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి. అవన్నీ యానిమేటెడ్ స్టిక్కర్స్ ఉండగా, స్టిక్కర్ ప్యాక్ డౌన్‌లోడ్ చేసుకుని వాడొచ్చు. కాగా, ప్రస్తుతం కొన్ని యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్స్‌ను మాత్రమే వాట్సప్ డిఫాల్ట్‌గా అందిస్తోంది. ఇవే కాకుండా స్టిక్కర్ స్టోర్ నుంచి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్టిక్కర్ ప్యాక్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే థర్డ్ పార్టీ యానిమేటెడ్ స్టిక్కర్స్ వల్ల కొన్ని సమస్యలు రావొచ్చు. యానిమేటెడ్ స్టిక్కర్స్ కోసం హానికరమైన యాప్స్ డౌన్‌లోడ్ చేయకూడదు. ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసేముందు రేటింగ్స్, రివ్యూస్ పరిశీలించడం మంచిది.