కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుండే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ ని వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం డెవలపింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ డేటాను వినియోగదారులు తమ చాట్ హిస్టరీతో సహా ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ కి ట్రాన్స్ ఫర్ చేయడానికి అనుమతినిస్తుంది. యూజర్లు ఇప్పటివరకు గూగుల్ డిస్క్ బ్యాకప్ ని ఉపయోగించి డేటాను బదిలీ చేస్తున్నారు. కొత్త ఫీచర్ ద్వారా థర్డ్ పార్టీ యాప్ లపై ఆధారపడడాన్ని తప్పిస్తుంది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా యూజర్లు తమ చాట్ హిస్టరీని ఈ కొత్త ఫీచర్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఇక గతేడాది ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్ కి బదిలీ ఫీచర్ ని విడుదల చేసింది.