WHATSAPP CALLS FROM DESKTOP COMPUTERS
mictv telugu

వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్

November 24, 2022

యూజర్లను వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో పలకరిస్తునే ఉంటుంది. కొత్త అనుభూతిని పంచే క్రమంలో వినూత్న సేవలను అందిస్తుంది. తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌తో మందుకొచ్చింది. డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో కాల్స్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించే అప్‌డేట్‌పై దృష్టి పెట్టింది. త్వరలోనే ఫీచర్ వాట్సాప్ అందుబాటులోకి తీసుకొస్తోంది.వాట్సాప్‌ నుంచి మొబైల్‌ ఫోన్లలో కాల్‌ చేసుకునే సౌకర్యం ఉండగా, డెస్క్‌టాప్‌ బ్రౌజర్లు లేదా యాప్‌లో ఆ అవకాశం లేదు. దీంతో డెస్క్ టాప్‌లో ఈ సేవలను అందించేందుకు సిద్ధమైంది. స్టేటస్‌, చాట్స్‌, ట్యాబ్‌లకు మధ్యలో కాల్స్‌ ట్యాబ్‌ పొందుపరచనున్నారు. ఈ అప్‌డేట్ అందుబాటులోకి వస్తే గూగుల్‌ మీట్‌, జూమ్‌ వంటివాటికి వాట్సాప్‌ పోటీగా ఎదిగేందుకు అవకాశాలున్నాయి. ఈ మధ్యనే వాట్సాప్ ఒకే నంబర్‌‌తో ఒకే సారి రెండు స్మార్ట్‌ ఫోన్ల‌తో పాటుగా మరో రెండు డివైస్‌లలో వాట్సాప్‌ను యాక్సెస్‌ చేసుకోవడానికి ఓ ఫీచర్‌ని తెచ్చింది. ఈ మోడ్ ని కొన్ని బీటా టెస్టర్‌లకు విడుదల చేసి పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.