వాట్సప్‌ లో కోర్టు నోటీసులకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సప్‌ లో కోర్టు నోటీసులకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

July 11, 2020

bnvn

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని ఎన్నో కోర్టులను మూసివేసిన సంగతి తెల్సిందే. దీంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర న్యాయసేవలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు మరో వెసులుబాటును కల్పించింది.

కోర్టు సమన్లు, నోటీసులను  వాట్సప్, ఈ-మెయిళ్లు, ఫ్యాక్స్‌‌ వంటి సాధనాల ద్వారా పంపొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ ఎ బోబ్డే, జస్టిస్‌ ఎ ఎస్‌ బోపన్న, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కరోనా నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించి తాజా నిర్ణయాన్ని వెల్లడించింది.