వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటి కోసం చాలా ఫీచర్లపై పనిచేస్తున్నది. అయితే కేవలం సందేశాల మార్పిడి కోసం కాకుండా ప్రజలను కట్టిపడేసేందుకు మరిన్ని ఫీచర్లను తీసుకురానున్నది. ఒకప్పుడు కేవలం మాట్లాడేందుకు మాత్రమే ఫోన్స్ వాడేవారు. తర్వాత చూసుకొని మాట్లాడుకునే రోజులు వచ్చేశాయి. వాట్సప్ వచ్చాక అది మరింత పెరిగిందనడంలో సందేహం లేదు. అయితే మెరుగైన యాప్ గా మార్చడానికి చాలా మార్పులు చేస్తున్నది. యాప్ బీటీ వెర్షన్ లో కనిపించే ఒరిజినల్ ఫోటో క్వాలిటీ షేరింగ్ ఆప్షన్, ఇతర ఫీచర్ లపై ప్లాట్ ఫారమ్ పని చేస్తున్నది. త్వరలోనే ఆ మూడు ప్రధాన ఫీచర్లను విడుదల చేస్తుంది.
ఫోటో నాణ్యత..
వాట్సాప్ నుంచి పంపిన ఫోటో రెజల్యూషన్ తగ్గిపోతుందని తెలుసు. కానీ ఇక ముందు ఫోటో పరిమాణంలో మార్పు లేకుండా యథాతథాంగా ఆ ఫోటోను పంపించే వెసులుబాటు చేయనుంది. అసలు వాట్సాప్ లో రెండు కారణాల వల్ల ఫోటో నాణ్యత కుదింపు జరుగుతుంది. ఒకటి.. మొబైల్ డేటాను ఆదా చేయడం, రెండు.. ఫోటోలను వేగంగా షేర్ చేయడంలో సహాయపడుతుంది. అయితే వివిధ మార్గాల ద్వారా అధిక రెజల్యూషన్ ఫోటోలను పంచుకోవచ్చు. అలా వేరే మార్గాల ద్వారా కాకుండా నేరుగా పంపించేందుకు వాట్సాప్ పని చేస్తున్నది. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందో ప్రస్తుతం తెలియదు. భవిష్యత్ లో మాత్రం ఈ అప్ డేట్ ని అందించాలని WaBetaInfo నివేదించింది.
షేరింగ్ పరిమితి..
వాట్సాప్ ఇప్పుడు బీటా టెస్టర్ లను కాంటాక్ట్ లతో 100 చిత్రాల వరకు షేర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. WaBetaInfo షేర్ చేసిన వివరాల ప్రకారం.. యాప్ బీటా వెర్షన్ ని ఉపయోగిస్తున్న వ్యక్తులు ఒకేసారి చాలా చిత్రాలను షేర్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి 30కి మాత్రమే సెట్ చేయబడింది. దీన్ని 100 వరకు పెంచే ఆలోచనలో ఉంది. తాజా ఆండ్రాయిడ్ 2.23.4.3 బీటా అప్ డేట్ లో ఈ ఫీచర్ గుర్తించబడింది. భవిష్యత్ లో ఇది కూడా వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది.
చాట్ చరిత్ర సజావుగా..
గూగుల్ డ్రైవ్ ను ఉపయోగించకుండానే కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కి చాట్ చరిత్రను బదిలీ చేయడానికి వాట్సాప్ అనుమతిస్తుంది. చాట్ ని బదిలీ చేయడానికి వినియోగదారులు కేవలం క్యూఆర్ కోడ్స్ ను ఉపయోగించగలరు. కాబట్టి.. ముందుగా గూగుల్ డిస్క్ కి చాట్స్ ని బ్యాకప్ చేసి, ఆ పై బదిలీ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం ఇకపై ఉండకపోవచ్చు. WabetaInfo భాగస్వామ్యం చేసిన స్క్రీన్ షాట్స్, వ్యక్తుల యాప్ లో (కొత్త ఫోన్ లో) చాట్ బదిలీ విభాగాన్ని తెరిచ్చి కొత్త పరికరంలో కనిపించే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడానికి పాత ఫోన్ కెమెరాను ఉపయోగించేస్తే సరిపోతుంది. ఇది కూడా త్వరలోనే రాబోతున్న ఫీచర్.