వాట్సప్‌కీ ఫింగర్ ప్రింట్ లాక్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సప్‌కీ ఫింగర్ ప్రింట్ లాక్ వచ్చేసింది

November 3, 2019

ఆండ్రాయిడ్ వాట్సప్‌ యూజర్లకు ఫింగర్ ప్రింట్ లాక్ వచ్చేసింది. ఐఫోన్ యూజర్ల కోసం చాటింగ్ ప్రైవసీ, సెక్యూరిటీ నిమిత్తం గతంలోనే టచ్ ఐడీ, ఫేస్ ఐడీ సదుపాయాలను ఈ యాప్ తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఫోన్ల యూజర్ల కోసం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది.

ఈ కొత్త సదుపాయం కోసం ప్లే స్టోర్‌కు వెళ్లి ముందుగా వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఫింగర్ ప్రింట్ లాక్‌ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత మీరు వేలిముద్రను స్కాన్ చేసుకోవాలి. అప్పట్నుంచి వేలిముద్రతో వాట్సప్‌ను తెరిచి, చాట్ చేయవచ్చు. యాప్‌ను ఒకసారి తెరిచిన తర్వాత మళ్లీ ఎంతసేపటికి ఆటోమేటిక్‌గా లాక్ పడిపోవాలన్నది మీరు నిర్ణయించుకోవచ్చు.