whatsapp introducing new feature for ios users
mictv telugu

మరో కొత్త ఫీచర్ ను తీసుకువస్తున్న వాట్సాప్

March 20, 2023

whatsapp introducing new feature for ios users

ఎప్పటికప్పడు తనను తాను అప్డేట్ చేసుకోవడంలో వాట్సాప్ ముందుంటుంది. సోషల్ మీడియాలో వాట్సాప్ కి ఉన్న క్రేజ్ మరింక దేనికీ లేదు. వాట్సాప్ లాంటి తరువా ఎన్ని వచ్చినా దాన్ని మాత్రం బీట్ చేయలేకపోయారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తెస్తూ వాట్సాప్ దూసుకెళ్ళిపోతోంది. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ తో యూజర్ల ముందుకు వచ్చేసింది.

ఇమేజ్‌ల నుంచి టెక్స్ట్ కాపీ చేయడానికి మొబైల్ యూజర్లు నానా తంటాలు పడుతుంటారు. దీనికోసం ప్రత్యేకంగా యాప్స్ వెతుక్కుంటూ చాలా సమయం వృథా చేసుకుంటారు. దీనికి పరిష్కారం చూపిస్తూ వాట్సాప్ ‘టెక్స్ట్ డిటెక్షన్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతానికి వాట్సాప్ iOS 16 యూజర్లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌తో ఇమేజెస్ నుంచి టెక్స్ట్‌ను సింపుల్‌గా కాపీ చేసుకోవచ్చు. వాట్సాప్ వెర్షన్ 23.5.77కి అప్‌డేట్ చేసిన iOS 16 యూజర్లందరికీ టెక్స్ట్ డిటెక్షన్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని WABetaInfo రిపోర్ట్ వెల్లడించింది. ఆండ్రాయిడ్ యూజరల్కు ఈ ఫీచర్ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తోందో మాత్రం ఇంకా ప్రకటించలేదు.

అలాగే iOS యూజర్లు ఇక మీదట నుంచీ వాయిస్ నోట్స్ ఉపయోగించి స్టేటస్ అప్‌డేట్స్‌ను పోస్ట్ చేయవచ్చు. పిక్చర్-ఇన్-పిక్చర్ వీడియో సపోర్ట్ కూడా ఇందులో ఆఫర్ చేశారు. ఈ ఫీచర్ కోసం ప్రత్యేకంగా కొంతమంది లేదా ఒకరినే కూడా ఎంచుకోవచ్చును. దీనివల్ల మనం ఎవరి కోసం అయితే స్టేటస్ పెట్టామో వారికి మాత్రమే కనిపిస్తుంది.ఈ కొత్త ఫీచర్ ద్వారా, వాట్సప్ యూజర్లు 30 సెకన్ల వరకు ఆడియో స్టేటస్‌ను సెట్ చేయగలరు. ఇది కాకుండా, ఈ స్టేటస్ రియాక్షన్ ఫీచర్ కూడా జోడించబడింది. దీని సహాయంతో వినియోగదారు కూడా స్టేటస్‌కు ప్రతిస్పందించవచ్చును.