వాట్సప్ కొత్త అప్‌డేట్‌‌: బ్యాటరీని తినేస్తోంది.. - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సప్ కొత్త అప్‌డేట్‌‌: బ్యాటరీని తినేస్తోంది..

November 11, 2019

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తావస్తోంది. తాజాగా గోప్యత కోసం ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను కూడా తీసుకొని వచ్చింది. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ ఫీచర్‌ కారణంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో బ్యాటరీ ఛార్జింగ్‌ తొందరగా తగ్గిపోతోందని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు వినియోగదారులు ప్లే స్టోర్ లో వాట్సాప్ అప్లికేషన్‌కు 1 రేటింగ్ ఇచ్చి బ్యాటరీ సమస్య గురించి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా శాంసంగ్‌, వన్‌ప్లన్‌, షావోమి ఫోన్ల వినియోగదారులు ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్నారు. వాట్పాప్‌ కొత్త అప్‌డేట్ కారణంగా 33-40 శాతం బ్యాటరీ తొందరగా డ్రై అవుతోందని యూజర్లు వాపోతున్నారు.

WhatsApp is Killing.

ఆండ్రాయిడ్‌ 9, ఆండ్రాయిడ్‌ 10 ఓపార్టింగ్ సిస్టంతో పనిచేస్తున్న వన్‌ప్లస్‌ ఫోన్లలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌10, గెలాక్సీ నోట్ 10 సిరీస్‌ వంటి ఖరీదైన ఫోన్లలో కూడా ఈ సమస్య ఉత్పన్నమౌతోందట. ప్రస్తుతం వాట్సాప్‌ 2.19.308 వెర్షన్‌లో ఈ సమస్య అధికంగా ఉత్పన్నమవుతోంది. తమ ఫోన్లలో బ్యాటరీ సమస్య అధికంగా ఉన్నవారు వాట్సాప్‌ అన్ఇన్‌స్టాల్‌ చేసి ప్లే స్టోర్‌ నుంచి కొత్తగా వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని కొంత మంది వినియోగదారులు సోషల్ మీడియాలో సూచిస్తున్నారు. అయినప్పటికి బ్యాటరీ ఛార్జింగ్‌ తగ్గుతున్నట్లయితే బీటా వెర్షన్‌ని డౌన్‌‌లోడ్ చేసుకోవాలని మరికొందరు వినియోగదారులు సూచిస్తున్నారు. ఫోన్లో బ్యాటరీ సేవ్‌ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే అది బ్యాగ్రౌండ్‌ యాక్టివిటీని తగ్గిస్తుంది. అలా కొంతమేర బ్యాటరీ ఛార్జింగ్‌ను ఆదా చేసుకోవచ్చని పలువురు యూజర్స్‌ సూచిస్తున్నారు.