వాట్సాప్ కొత్త ఫీచర్లు.. ఒకే నంబర్‌తో వివిధ డివైజ్‌లలో!
ఒక నంబర్, ఒక ఫోన్, ఒకే వాట్సాప్.. వాట్సాప్ వెబ్‌లో కనెక్ట్ చేసుకుంటే డెస్క్‌టాప్‌పై వాట్సాప్ చూసుకోవచ్చు. అయితే ఇకపై ఒక వాట్సాప్‌ను ఇతర ఫోన్లలో చూసుకునే వెసలుబాటు కల్పించడానికి వాట్సాప్ పూనుకుంది. ఇదే కాకుండా మరిన్ని సరికొత్త ఫీచర్లను వాట్సాప్ తీసుకువస్తోంది. ఇప్పటికే వాట్సప్ డార్క్ మోడ్‌పై కసరత్తు చేస్తోంది.
వీటిని ఐఓఎస్, ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లలో పరిశీలిస్తోంది.
ఒక ఫోన్ నంబరుతో వివిధ డివైజ్‌లలో ఒకేసారి వాట్సప్ వాడుకొనేలా మార్పు చేస్తున్నారు. మొదట ఈ ఫీచర్‌ను ఐఓఎస్‌లో అందుబాటులోకి తెచ్చి, తర్వాత ఆండ్రాయిడ్ ఓఎస్‌లో చేర్చనున్నారు. అలాగే ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ అసిస్టెంట్ తెరిచి వాట్సప్ నుంచి వాయిస్, వీడియో కాల్ చేసుకొనే ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. మెసేజ్‌లు కూడా ఈ తరహాలోనే పంపుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్ అసిస్టెంట్ నుంచి కేవలం సాధారణ కాల్స్, డుయో ద్వారా వీడియో కాల్స్ చేసుకునే ఫీచర్ మాత్రమే ఉంది. తాజా ఫీచర్ పొందేందుకు వాట్సప్, గూగుల్ అసిస్టెంట్ రెండు యాప్‌లను అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది. 'హే గూగుల్' 'వాట్సప్ వీడియో' అని చెప్పి వీడియో కాల్ చేసుకోవచ్చు.
ఐఫోన్ వినియోగదారుల కోసం వాట్సప్ ఆడియో ప్లే బ్యాక్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇప్పటివరకూ పంపిన ఆడియో లేదా వాయిస్ మెసేజ్‌లను యాప్ తెరిచి వినాల్సివస్తోంది.
కొత్త వెర్షన్ 2.19.91.1లో ఇది మరింత అప్‌డేటెడ్‌గా రానుంది. ఎవరైనా వాట్సప్‌లో ఆడియో ఫైల్ పంపినప్పుడు దాన్ని నోటిఫికేషన్ బార్ నుంచే వినే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీంతోపాటు డెస్క్‌టాప్‌లోనూ ఆల్బమ్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఎవరైనా కొన్ని ఫోటోలు లేదా వీడియోలు పంపితే అవన్నీ ఛాట్ హిస్టరీలో ఒక ఆల్బమ్‌లా కనిపిస్తున్నాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం డెస్క్‌టాప్‌లో లేదు. ఒక ఫోటో కింద మరో ఫోటో వరుసగా కనిపిస్తున్నాయి.