వాట్సాప్ మరో అదిరిపోయే ఫీచర్.. - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్ మరో అదిరిపోయే ఫీచర్..

October 4, 2019

ఎప్పుడూ సరికొత్త ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసేంజరింగ్ సంస్థ వాట్సాప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మెసేజ్‌లను మనం వద్దనుకుంటే మాత్రమే డిలిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇక నుంచి దీంట్లో మరిన్ని మార్పులు చేసింది.. ఇక నుంచి ఏదైనా మెసేజ్ నిర్ణిత కాలంలో దానికదే  డిలీట్ అయిపోయే ఆప్షన్ తీసుకురాబోతున్నారు. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. 

Whatsapp Messages.

మనం ఎవరికైనా పంపిన మెసేజ్ 5 సెకన్ల నుంచి గంట సమయం వరకు మాత్రమే కనిపించేలా వాట్సాప్ సెట్టింగ్స్ మార్పు చేస్తున్నారు. దీంతో  మనం పంపే మెసేజ్ మనం అనుకున్న సమయం వరకు మాత్రమే కనిపించనుంది. దీనికోసం సెట్టింగ్స్ విభాగంలో డిసప్పియరింగ్ మెసేజెస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీని ప్రకారం సెట్ చేస్తే మెసేజ్ కావాల్సినంత సమయం మాత్రమే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో త్వరలోనే మిగితా యూజర్లకు అందుబాటులోకి రానుంది.