వాట్సాప్‌లో ఇక కాల్ వెయిటింగ్ ఫీచర్ - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్‌లో ఇక కాల్ వెయిటింగ్ ఫీచర్

December 7, 2019

Whatsapp new feature call waiting 

వినియోగదారుల అవసరాలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్ ఈసారి కాల్స్ విషయంపై దృష్టి సారించింది. ప్రైవసీ, ఫింగర్ ప్రింట్, యూట్యూబ్ విండోలు తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా కాల్ వెయింటింగ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మనకు ఎవరైనా ఫోన్ చేస్తే మనం బిజీగా ఉండడంతో ఆ కాల్ కట్ అవుతుంది. మనం అవతలి వ్యక్తితో మాట్లాడ్డం పూర్తి చేశాక.. మనం మిస్ అయిన కాల్ వివరాలు తెలుసుకోలేకపోతున్నాం. కాల్ వెయిటింగ్ ఫీచర్‌తో మనం మిస్ అయిన కాల్స్ వివరాలు తెలుసుకోవచ్చు. 

ఈ ఫీచర్ ఇప్పటికే వాట్సాప్ ఐఓస్ యూజర్లకు అందుబాటులోకి తాజాగా ఆండ్రాయిడ్‌ ఫోన్ యూజర్లకు కూడా చేరువైంది. మనకు కాల్‌లో ఉన్నప్పుడు వేరే కాల్ వస్తే మనకు కాల్‌ వెయిటింగ్‌ అలెర్ట్‌ వస్తుంది. ఈ విషయం మనకు తెలుస్తుంది కూడా. దీంతో మనం అవసరం అనుకుంటే మనం మాట్లాడుతున్న వ్యక్తి కాల్‌ను హోల్డ్‌లో ఉంచి మాట్లాడుకోవచ్చు వెయిటింగ్ కాల్‌ను తీసుకోవచ్చు. అయితే కాల్‌ను హోల్డ్‌లో పెట్టే సదుపాయం మాత్రం లేదు.