వాట్సాప్ కొత్త ఫీచర్స్ ఇవే..
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో యూజర్లకు అనుభూతిని పంచుతున్నవాట్సాప్ మరో మూడు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌చాట్ పోల్స్ క్రియేట్ చేయడం, 32 మందితో వీడియో కాలింగ్, 1,024 మందితో గ్రూప్ క్రియేట్ చేసే సామర్థ్యాన్ని వాట్సాప్ అందించింది.
‘వాట్సాప్ కమ్యూనిటీస్‌ను ఈరోజు మేం లాంచ్ చేస్తున్నాం. సబ్ గ్రూప్స్ ద్వారా గ్రూపులను ఇది మరింత బెటర్ చేయనుంది. వాట్సాప్‌లో పోల్స్, 32 పర్సన్ వీడియో కాలింగ్ కూడా అందుబాటులో ఉండనుందని మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
వీటితో పాటు ఎమోజీ రియాక్షన్, 2GB ఫైల్ షేరింగ్, మెసేజ్‌లను డిలీట్ చేయడం, కమ్యూనిటీ క్రియేట్ చేసి చాట్ చేసుకోవడం వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్స్ ఇప్పటికే కొంతమందికి రాగా..ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి.