వాట్సాప్ శుభవార్త.. ఎప్పటికీ ఆ తలనొప్పి లేకుండా.. - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్ శుభవార్త.. ఎప్పటికీ ఆ తలనొప్పి లేకుండా..

October 23, 2020

కుటుంబం, స్నేహితులు ఇలా చక్కని రిలేషన్ కోసం తీసుకువచ్చిన వాట్సాప్ కాస్తా ఫేక్ వార్తలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వాట్సాప్‌లోకి ఓ మెసేజ్ రాగానే వెనకా ముందు ఏం ఆలోచించకుండా దానిని ఫార్వార్డ్ చేసేస్తుంటారు. ఇలాంటివాటితో ఎందరికో జరగాల్సిన నష్టం జరుగుతోంది. పైగా మన అనుమతి లేకుండా కొందరు మనకు సంబంధం లేని గ్రూపుల్లో యాడ్ చేస్తుంటారు. కొత్త ఆప్షన్ రావడం వల్ల ఆ తల నొప్పి తగ్గింది. మనకు నచ్చితేనే గ్రూపులో జాయిన్ అయ్యే విధంగా వాట్సాప్ అప్‌డేట్ అయిన విషయం తెలిసిందే. అది పోయినా గ్రూపు చాట్స్, అలర్ట్స్‌తో యూజర్లు మరింత విసుగు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ మరింత అప్‌డేట్ అయింది. వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ ఫీచర్‌ను చివరకు లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక సంవత్సరం పాటు మ్యూట్ చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వాట్సాప్‌లోని గ్రూప్ చాట్‌లను ‘ఆల్వేస్ మ్యూట్’ అనే ఆప్షన్‌తో ఎప్పటికీ మ్యూట్ చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

ఈ మేరకు వాట్సాప్ తన అధికారిక ట్విటర్‌లో ప్రకటించింది. చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చని పేర్కొంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా ఇది అందుబాటులో ఉండనుందని తెలిపింది. ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారులకు ఇకపై ఏ ఇబ్బంది కలగదు అని పేర్కొంది. ఇబ్బందికరమైన వాట్సాప్ గ్రూపులనుంచి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇది సహాయపడుతుందని వివరించింది. చాట్‌ను మ్యూట్ చేస్తే సంబంధిత గ్రూపులనుంచి నోటిఫికేషన్ రాదని.. మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, ఇతర ఏ ఫీడ్‌ అయినా ఇబ్బంది పెట్టదని స్పష్టంచేసింది. మరోపక్క దీనికి అన్‌మ్యూటింగ్ ఆప్షన్ సదుపాయం కూడా కల్పించింది.