WhatsApp rolls out photo quality feature
mictv telugu

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇప్పుడే చెక్ చేసుకోండి

February 16, 2023

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంటోంది. ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్‌లో కొన్ని మల్టీ ఫీచర్లపై పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా తమ యూజర్ల కోసం వాట్సప్ ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలను షేర్ చేసేందుకు కొత్త ఫీచర్‌ను ప్రవేవపెట్టింది. ఈ ఏడాదిలో వాట్సప్ అతిపెద్ద అప్‌డేట్‌లలో ఇది ఒకటని చెప్పవచ్చు. వాట్సాప్ యూజర్లకు చాలా అవసరమైన ఫీచర్. కాంటాక్ట్‌లతో హై-క్వాలిటీ ఫోటోలను షేర్ చేయడంలో ఈ ఫీచర్ సాయపడుతుంది. వాట్సప్ లో హై క్వాలిటీ ఫొటోలు పంపించడంలో ఇప్పటిదాకా సమస్య ఉంది. తాజా ఫీచర్ ద్వారా నేరుగా హై క్వాలిటీ ఫొటోలు పంపుకొనే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది.

ఇందుకోసం సెట్టింగ్స్ లో స్టోరేజ్ అండ్ డాటా ఆప్షన్ లోకి వెళ్లాలి.
అందులో ఆప్షన్స్ టాప్ లో మీడియా అప్ లోడ్ క్వాలిటీని సెలక్ట్ చేయాలి.
ఇప్పుడు వాటిలో ఆటో, బెస్ట్ క్వాలిటీ, డాటా సేవర్ అనే మూడు ఆప్షన్లు ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీ ఆప్షన్ ను టిక్ చేస్తే హై క్వాలిటీ ఫొటోలను పంపించవచ్చు.
ఈ సౌకర్యం ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఐ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది.

మరోవైపు 2GB పరిమాణంలో ఉన్న డాక్యుమెంట్‌లను షేర్ చేసే సదుపాయాన్ని వినియోగదారులు అందించేందుకు కృషి చేస్తోంది వాట్సప్. ఈ ఫీచర్‌ను భవిష్యత్తులో రానున్న iOS యాప్ అప్‌డేట్‌లో అందించాలనే యోచనలో ఉంది. వాట్సాప్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo తెలిపిన వివరాల మేరకు.. 2GB పరిమాణంలో ఉన్న డాక్యుమెంట్‌లను షేర్ చేసే సామర్థ్యం అందుబాటులో ఉందని, దీని ద్వారా పెద్ద డాక్యుమెంట్‌లను షేర్ చేయడం సులభతరం చేస్తుందని తెలిపింది. ఈ అప్‌డేట్‌ను త్వరలో ప్రకటించాలనే ఆలోచనలో వాట్సాప్ ఉందని పేర్కొంది. వాట్సాప్ ఇప్పటికే గత సంవత్సరం 512 మంది వ్యక్తులను గ్రూప్‌లో యాడ్‌ చేసే సదుపాయం కల్పించింది. తాజా వాట్సాప్ బీటా, iOS 23.3.0.76 అప్‌డేట్‌ ద్వారా భవిష్యత్తులో iOS యాప్ అప్‌డేట్‌లో ఇలాంటి ఫీచర్‌ను విడుదల చేయడానికి వాట్సాప్‌ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసిందని WABetaInfo పేర్కొంది.