WhatsApp testing temporary groups with expiry date
mictv telugu

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. గ్రూప్‌లకు ఎక్స్‌పైరీ డేట్

March 9, 2023

WhatsApp testing temporary groups with expiry date

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను అందిస్తోంది. తాజాగా మరో సేవను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా ప్రతీ ఒక్కరూ వాట్సాప్‌లో పర్సనల్ చాటింగ్‌తో పాటు ఫ్రెండ్స్, కొలిగ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్‌తో చాటింగ్ కోసం గ్రూప్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇవి దాదాపు వాట్సాప్‌లో పర్మినెంట్‌గా కొనసాగుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్.. మ్యారేజ్ ఫంక్షన్, బర్త్ డే ఫంక్షన్లకు ఇన్విటేషన్ కోసం, లేదంటే వేరే ఏదైనా తాత్కాలిక అవసరాల కోసం మనలో చాలామంది వాట్సాప్ లో గ్రూప్స్ క్రియేట్ చేస్తుంటాం. అయితే ఇలా క్రియేట్ చేయబడ్డ గ్రూప్స్ ఆయా ఫంక్షన్లు, ప్రొగ్రామ్‌లు ముగిసిన తర్వాత కూడా పర్మనెంట్ గా ఉండిపోతుంటాయి. అయితే ఇకపై ఇటువంటి తాత్కాలిక గ్రూప్స్ ఆటోమేటిగ్ గా డిలీట్ అవడానికి వాట్సాప్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ గ్రూప్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేందుకు మెటా యాజమాన్యం కొత్తగా ‘ఎక్స్‌పైరింగ్ గ్రూప్‌లు’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తాత్కలికంగా, ఎంపిక చేసిన నిర్ణిత సమయానికి(తేదీ) ఆటోమెటిగ్‌గా డిలీట్ అయ్యే విధంగా వాట్సాప్ గ్రూప్‌లను సెట్ చేయవచ్చు. ఇది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

అలాంటి టెంపరరీ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్తే గ్రూప్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఎక్స్ పైరింగ్ గ్రూప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై టాప్ చేసిన వెంటనే మళ్లీ నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్లలో రోజు, వారం, కస్టమ్ డేట్, రిమూవ్ ఎక్స్ పైరేషన్ డేట్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ ఆప్షన్ల ద్వారా గ్రూప్ ఎన్ని రోజుల్లో ఆటోమేటిక్ గా డిలీట్ అవ్వాలో తేదీని ఫిక్స్ చేసుకోవచ్చు. అలా ఫిక్స్ చేసిన తేదీన ఆటోమేటిక్ గా తాత్కాలిక గ్రూపు డిలీట్ అవుతుంది. ఒకవేళ గ్రూప్ ను తాత్కాలిక అవసరాల కోసం ఏర్పాటు చేసినప్పటికీ దానిని లైవ్ లోనే ఉంచాలని నిర్ణయించుకుంటే రిమూవ్ ఎక్స్ పైరేషన్ డేట్ పై క్లిక్ చేసి మళ్లీ డేట్ ను మార్చుకోవచ్చు. అలా అడ్మిన్ గ్రూప్ ను ఎన్ని రోజులైనా లైవ్ లో పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సరికొత్త ఫీచర్ ను వాట్సాప్ అతి త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.