వాట్సాప్ కొత్త ఫీచర్.. స్కాన్ చేస్తే చాలు నంబర్ సేవ్ - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్ కొత్త ఫీచర్.. స్కాన్ చేస్తే చాలు నంబర్ సేవ్

May 23, 2020

wtss...

ప్రముఖ మెసేంజ్ యాప్ వాట్సాప్ ఎప్పుడూ తన యూజర్ల కోసం రకరకాల సదుపాయాలను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా మరో ఫీచర్ తెచ్చింది. దీని ద్వారా ఇక నుంచి కొత్త కాంటాక్ట్ నంబర్లను టైపు చేయకుండానే యాడ్ చేసుకోవచ్చు. కేవలం స్కాన్ చేసి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఫీడ్ చేసుకునే అవకాశం కల్పించింది. 

కొన్నిసార్లు కొత్త నంబర్లను యాడ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఒక సంఖ్యకు బదులు మరొక సంఖ్య పడటం ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు లేకుండా సులువుగా యాడ్ చేసుకునే మార్గాన్ని కనిపెట్టింది. దీని కోసం మనం ఎవరైతే నంబర్ యాడ్ చేసుకోవాలో వాళ్ల వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఆ నంబర్ కాంటాక్ట్‌లో చేరిపోతుంది. దీంతో మ్యానువల్‌గా టైప్‌ చేస్తే పొరపాట్లను తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లోనే ఉంది. అతి త్వరలోనే యాజర్లందరికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.