WhatsApp that says good news ... from now on all at once
mictv telugu

వాట్సాప్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..ఇక నుంచి ఒకేసారి

June 4, 2022

WhatsApp that says good news ... from now on all at once

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు ప్రముఖ మొబైల్ సంస్థ వాట్సాప్ మరో శుభవార్త చెప్పింది. ఇక నుంచి వాట్సాప్ నుంచి 2 జీబీ వ‌ర‌కు సైజ్ క‌లిగిన ఫైల్స్‌ను ఒకేసారి పంపించుకునే విధంగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వాట్సాప్‌లో పెద్ద సైజ్ వీడియోల‌ను ఇత‌రుల‌కు పంపించాలంటే చాలా సమయం పడుతుంది. కేవ‌లం 100 ఎంబీలోపు ఉన్న ఫైల్స్‌ మాత్ర‌మే ఇతరులకు సెండ్ అవుతుంది. దీంతో చాలామంది యూజ‌ర్లు పెద్ద ఫైల్స్‌ను పంపించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కస్టమర్ల ఇబ్బందిని గుర్తించిన వాట్సాప్.. స‌రికొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి 2 జీబీ సైజ్ క‌లిగిన వీడియోలను, ఫైల్స్‌ను పంపించుకునే వసూలు బాటును కల్పించినట్లు తెలిపింది.(అంటే ఒకేసారి ఒక సినిమా మొత్తాన్ని మ‌నం వాట్సాప్‌లో షేర్ చేయొచ్చ‌న్న‌మాట)

‘ఈ ఫీచ‌ర్‌ ప్రస్తుతం అర్జెంటీనా దేశంలో అమల్లో ఉంది. అక్కడి కస్టమర్ల అభిప్రాయాలను సేకరించి, తాజాగా ఈ ఫీచ‌ర్‌ను ఇత‌ర దేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ యూజ‌ర్లు ఎవ‌రైనా ఈ స‌దుపాయాన్ని వినియోగించుకోవ‌చ్చు. కాక‌పోతే, ఇది ఒకేసారి అంద‌రికీ అందుబాటులోకి రాలేదు. ప్ర‌స్తుతానికి కొంత‌మంది యూజ‌ర్లు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్‌ను వినియోగించుకునే అవ‌కాశం ఉంది. మిగిలిన యూజ‌ర్ల‌కు త్వ‌ర‌లోనే ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది’ అని వాట్సాప్ సంస్థ వెల్లడించింది.

ఇక, మన మొబైల్ ఫోన్‌లో ఈ ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చిందా? లేదా? అని తెలుసుకోవడానికి..’ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. ఆ త‌ర్వాత ఏదైనా ఓ కాంటాక్ట్ నంబ‌ర్‌కు 100 ఎంబీ కంటే ఎక్కువ సైజ్ ఉన్న వీడియోను డాక్యుమెంట్ రూపంలో అటాచ్ చేయండి. అప్పుడు ఆ వీడియో అప్‌లోడ్ అయితే మీకు ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్టు. ఒక‌వేళ అప్‌లోడింగ్ ఫెయిలైతే, ఈ ఫీచ‌ర్ కోసం మీరు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.’