వాట్సాప్ అప్‌డేట్‌.. 2 రోజుల 12 గంటలకు పొడిగింపు - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్ అప్‌డేట్‌.. 2 రోజుల 12 గంటలకు పొడిగింపు

July 3, 2022

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ప్రముఖ మొబైల్ యాప్ వాట్సాప్ శుభవార్తను చెప్పింది. వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, కొత్త అప్‌డేట్స్‌తో వాట్సాప్ ముందుకెళ్తోంది. తాజాగా వాట్సాప్ యాజమాన్యం ఓ కొత్త అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తోందని పేర్కొంది. యూజర్ల సౌలభ్యం కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘డిలీట్‌ ఫర్‌ ఎవరివన్‌’ అనే ఆప్షన్‌ను ఆప్‌డేట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

 

అంటే..యూజర్లు పొరపాటున ఏదైనా మేసేజ్‌ను గాని, ఫోటోను గాని, వీడియోను గాని పంపించాల్సిన వ్యక్తులకు పంపకుండా కుటుంబ సభ్యులకో,స్నేహితులకో పంపితే వాటిని వెంటనే డిలీట్ చేసే సదుపాయం ప్రస్తుతం వాట్సాప్‌లో ఉంది. దానినే ‘డిలీట్‌ ఫర్‌ ఎవరివన్‌’ అంటారు. పొరపాటుగా పంపిన మేసేజ్‌ను డిలీట్ చేసేందుకు ప్రస్తుతం వాట్సాప్‌లో 1 గంట, 8 నిమిషాల, 16 సెకన్ల టైం మాత్రమే ఉంది. తాజాగా ఆ టైంను పొడగిస్తూ, వాట్సాప్ మరో అప్‌డెట్‌ను తీసుకొస్తుంది. ఈసారి ఏకంగా 2రోజుల 12 గంటల వరకు సమయాన్ని పొడిగించే ప్రయత్నం చేసిందట. అంటే దాదాపు రెండున్నర రోజుల టైం అన్నమాట.

”వాట్సాప్‌లో డిలీట్ టైంను పొడగిస్తూ, డిలీట్‌ ఫర్‌ ఎవరివన్‌ ఆప్షన్‌ను అప్‌డేట్‌ చేశాం. ఈ అప్‌డేట్‌ ప్రకారం మిస్టేక్‌ ఉన్న మెసేజ్‌లను డిలీట్‌ చేసేందుకు 2 రోజుల 12 గంటల సమయం వరకు పొడిగించాం. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. త్వరలోనే అందరికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది” అని వీ బీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పేర్కొంది.