Home > Featured > నకిలీ వాట్సాప్‌తో జాగ్రత్త.. వాట్సప్ సీఈవో

నకిలీ వాట్సాప్‌తో జాగ్రత్త.. వాట్సప్ సీఈవో

ప్రస్తుతం కాలంలో వాట్సాప్ వాడని వాళ్లు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మధ్య నకిలీ వాట్సాప్ యాప్ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోందని.. యూజర్లు అంతా జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సీఈవో విల్ కాథ్ కార్చ్ హెచ్చరించారు. అచ్చంగా వాట్సప్ లాగే ఉంటుందని, అందులో లేని ఫీచర్లు కూడా ఇందులో దొరుకుతాయని.. ఎవరైనా చెబితే ఎంత మాత్రం విశ్వసించొద్దని అంటున్నారు. అంతే కాదు.. వాట్సాప్ పేరుతో వస్తున్న హే వాట్సాప్ యాప్ ను వాడితే అనేక రకాల సమస్యలు ఎదుర్కోక తప్పదని సూచించారు.

వాట్సాప్ లో లేని కొన్ని అదనపు ఫీచర్లు హే వాట్సాప్ యాప్ లో ఉన్నాయని, దానికి ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉండదని తెలిపారు. హే వాట్సాప్ వాడితే వ్యక్తిగత సమాచారం అపహరణకు గురవుతుందని.. ఆయన వాట్సాప్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చారు. ‘‘వాట్సాప్‌ పేరుతో వస్తున్న ఎలాంటి నకిలీ యాప్‌లను వాడొద్దు. ఒకవేళ వాడితే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు’’ అంటూ విల్‌ హెచ్చరించారు. ఇలాంటి నకిలీ యాప్‌ల వల్ల పర్సనల్ డేటా చోరీకి గురవుతుందని తెలిపారు.

Updated : 12 July 2022 9:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top