పొరపాటున వాట్సప్ మెసేజ్ డిలీట్ చేశారా..? ఇకపై నో ప్రాబ్లెం
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందవచ్చు. పొరపాటున డిలీట్ చేసిన మెసేజ్‌ను సెకన్ల వ్యవధిలో రికవర్ చేసుకునే అవకాశాన్ని కల్పించుంది. ఇందుకోసం అన్‌డూ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ముందుగా బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ను అందిస్తోంది. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.18.13 కు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ వెర్షన్ వాడుతున్న వారికి ఇది అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ ఈ సదుపాయం రానుంది.
ఈ అన్‌డూ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..
యూజర్లు మెసేజ్ డిలీట్ చేసిన వెంటనే చాట్ స్క్రీన్ మీద మెసేజ్ డిలీటెడ్ లైన్‌తోపాటు కింది భాగం కుడి వైపున అన్‌డూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అన్‌డూపై క్లిక్ చేస్తే డిలీట్ చేసిన మెసేజ్ తిరిగి చాట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మెసేజ్ డిలీట్ చేసేప్పుడు యూజర్ డిలీట్ ఫర్ మీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అన్‌డూ ఆప్షన్ కనిపించదు. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ ద్వారా డిలీట్ చేసిన మెసేజ్‌లకు మాత్రమే అన్‌డూ ఆప్షన్ చూపిస్తుంది.
ప్రస్తుతం ఈ అన్‌డూ ఫీచర్ కొందరు బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. టెస్టింగ్ పూర్తయ్యాక యూజర్లందరికీ దీన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకొస్తుంది. మూడు నెలల్లోగా ఈ ఫీచర్ అందరికీ రోల్అవుట్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.