whatsapp will add new feature in groups
mictv telugu

వాట్సాప్‌ కొత్త ఫీచర్.. మొహమాటాలకు చెల్లుచీటీ

May 17, 2022

whatsapp will add new feature in groups

వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఏదైనా నచ్చని గ్రూపులో మిమ్మల్ని యాడ్ చేస్తే, అందులోంచి ఎగ్జిట్ అవడాన్ని సులభతరం చేస్తోంది. వివరాలు.. వాట్సాప్ గ్రూపుల్లో మనకు నచ్చనివి చాలా ఉంటాయి. చాలా గ్రూపుల్లో విషెష్‌లు, ఫార్వార్డ్ మెసేజ్‌లు, పనికిరాని రాజకీయ చర్చలు తప్ప ఉపయోగపడే అంశాలు ఉండడం లేదు.

అలాంటి గ్రూపుల నుంచి వైదొలగాలని చాలా మందికి ఉన్నా.. మనం ఎగ్జిట్ అవుతున్న విషయం గ్రూపులో అందరికీ తెలిసిపోతుంది. దీంతో మొహమాటం, ఎవరేమనుకుంటారో అన్న సందిగ్ధతతో చాలా మంది ఎగ్జిట్ అవడానికి వెనకంజ వేస్తుంటారు. ఈ ఇబ్బందులను గమనించిన సంస్థ.. ఎగ్జిట్ అయ్యే అవకాశాలను మరింత సులభతరం చేసింది. మనం వైదొలిగిన విషయం కేవలం అడ్మిన్‌కు తప్ప మిగతా గ్రూపు సభ్యులకు తెలియని విధంగా మార్పులు చేస్తోంది. అయితే ఎప్పటినుంచి ఈ ఫీచర్ అందుబాటులోకి తేనుందో వాట్సాప్ ప్రకటించలేదు.