ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. తమ టెక్నాలజీకి అనుగుణంగా లేని స్మార్ట్ ఫోన్లలో సేవలను నిలిపివేస్తుంది. ఇందులో భాగంగా కొత్త ఏడాదిలో కూడా 49 స్మార్ట్ ఫోన్ మోడళ్లలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. యూజర్లు దీనిని గమనించాలని, డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ విడుదల చేసే ఫీచర్లు, సెక్యూరిటీ అప్ డేట్లు ఆయా ఫోన్లకు రావని ప్రకటించింది.
అంతేకాక ఏయే ఫోన్లలో వాట్సాప్ నిలిపివేస్తామో కూడా వెల్లడించింది. ఇందులో ఎక్కువగా పాత వెర్షన్లే ఉండగా, వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఐఫోన్ 5, 5సీతో పాటు శాంసంగ్ సిరీస్ గెలాక్సీ సిరీస్ లో కోర్, ఎస్2, ఎస్3 మినీ, ట్రెండ్ 2, ట్రెండ్ లైట్, ఎక్స్ కవర్2, ఏఎస్2 మోడళ్లు, హెచ్టీసీ డిజైర్, లెనోవా ఏ820, క్వాడ్ ఎక్సెల్, ఎల్జీ ఎనాక్ట్, ఎల్జీ లూసిడ్2, ఎల్జీ ఆప్టిమస్ సిరీస్, సోనీ ఎక్స్ పీరియా ఆర్క్ ఎస్, ఎక్స్ పీరియా మిరో, ఎక్స్ పీరియా నియోఎల్, ఆర్కోస్ 53 ప్లాటినం, గ్రాండ్ ఎస్ ప్లెక్స్ జెడ్ టీఈ, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987 జెడ్ టీఈ, వికో సింక్ ఫైవ్, వికో డార్క్ నైట్ జెడ్ టీ మోడళ్లకు చెందిన ఫోన్లలో వాట్సాప్ పని చేయదని మెటా తెలిపింది. ఇప్పటికీ ఈ ఫోన్లను ఎవరైనా వాడుతుంటే కొత్త ఫోన్లకు మారడం లేదా వాట్సాప్ వినియోగించడం ఆపేయడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది.