WhatsApp will soon let you answer video calls with animated avatars
mictv telugu

వాట్సప్‌లో ‘అవతార్’ ఫీచర్.. వీడియో కాలింగ్‌ ఇక భలే మజా

June 30, 2022

వాట్సప్ వినియోగదారులకు ఓ కొత్త అనుభూతిని పరిచయం చేయనుంది మెటా కంపెనీ. అవతార్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వీడియోకాల్‌ చేసే సమయంలో యూజర్లు వీటిని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) వెల్లడించింది.

ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు వీడియో కాల్ చేసినప్పుడు స్క్రీన్‌ మీద స్విచ్‌ టు అవతార్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే యూజర్‌ ప్రొఫైల్ ఫొటో స్థానంలో యానిమేటెడ్‌ అవతార్‌ కనిపిస్తుంది. అంటే యూజర్లు వీడియోకాల్ చేసేప్పుడు ప్రొఫైల్‌ ఫొటో స్థానంలో యానిమేటెడ్ అవతార్‌లను రీప్లేస్‌ చేసుకోవచ్చు. ఇవి 2డీ లేదా 3డీ రూపంలో ఉంటాయని సమాచారం. ఇప్పటికే గూగుల్ డ్యుయో వీడియో కాలింగ్‌లో యానిమేటెడ్‌ అవతార్‌లతోపాటు ఫిల్టర్‌ ఫీచర్లను అందిస్తోంది.