వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్లు! - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్లు!

September 20, 2020

cn vgb n

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ లో త్వరలో కొత్త ఫీచర్లు రాబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఫీచర్లు ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌ దశలో ఉన్నాయి. ప్రస్తుతం వాట్సాప్‌‌లో వీడియో కాలింగ్‌ సదుపాయం అందుబాటులో ఉన్నది. కొత్తగా రాబోతున్న అప్‌డేట్‌లో గ్రూప్‌ కాలింగ్‌కు ఓ ప్రత్యేక రింగ్‌టోన్లను పెట్టుకునే అవకాశం కల్పించనుంది. దీంతో వాట్సాప్‌కు వచ్చేది గ్రూప్‌ కాల్‌ లేదా వ్యక్తిగత కాల్‌ అనేది తెలుసుకోవచ్చు. 

ఇప్పటి వరకు డెస్క్‌టాప్‌, వెబ్‌ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న వాట్సాప్ డూడుల్స్‌ ఇక నుంచి ఫోన్ వెర్షన్‌లోనూ రానుంది. డూడుల్స్‌ యాప్‌ను వేరేగా డౌన్‌లోడ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌లోనే రానున్నాయి. కాలింగ్‌ ఇప్రూవ్‌మెంట్‌ కోసం యూజర్‌ ఇంటర్‌ఫేస్‌‌లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు పైభాగంలో ఉండే కాలింగ్‌ బటన్‌ స్తానం మారనుంది. ఇన్‌ఫో, ఆడియో, వీడియో, కెమెరా బటన్స్‌తోపాటు మెసేజింగ్‌ బటన్‌ కూడా ఉండనుంది. మరికొన్ని యానిమేటెడ్‌ స్టిక్కర్స్‌ను అందుబాటులోకి రానున్నాయి. అలాగే డెస్క్ టాప్ వీడియో కాలింగ్ ఆప్షన్ కూడా రానుందని తెలుస్తోంది. వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతా కలిగిన వారికి అదనపు ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. పోర్టిఫోలియోకు షార్ట్‌కట్‌గా కాటలాగ్‌ ఫీచర్‌ను జోడించనుంది.