వాట్సాప్‌లో మరో ఖతర్నాక్ ఫీచర్.. పనిలో పనిగా.. - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్‌లో మరో ఖతర్నాక్ ఫీచర్.. పనిలో పనిగా..

October 3, 2018

వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లును కట్టిపడేసుకుంటోంది. మరో నెట్ వర్కింగ్ వైపు వెళ్లకుండా సకల హంగులూ సమకూర్చిపెడుతోంది. అష్టావధానం టైపులో వాట్సాప్ చూసుకుంటేనే నానా రకాల పనులను చక్కబెట్టుకునే ఒక సూఫర్ ఫీచర్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. దీని పేరు  ‘పిక్చర్‌ ఇన్‌ పిక్చర్’ (పీఐపీ). వినియోగదారులు వీడియోలు వీక్షించేందుకు దీన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం దీన్ని బీటా వర్షన్‌లోనే విడుదల చేశారు. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

tt

వీఐపీ ద్వారా యూజర్లు తమకిష్టమైన యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్ట్రీమింగ్ వీడియోలను ఇతర యాప్లను వాడుతూనే స్క్రీన్‌పై చిన్న విండోలో చూసుకోవచ్చు. విండోను ఒక మూల అమర్చుకోవచ్చు. వీడియోలు చూస్తూ నానారకాల యాప్‌లలో చాటింగులు, ఇతర వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు. మొబైల్ ఫోన్లోని వాట్సప్ బీటా వెర్షన్ను అప్డేట్ చేస్తే ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. అలా రాకపోతే చాటింగ్ వివరాలను బ్యాకప్ తీసుకొని వాట్సాప్ను అన్ఇన్స్టాల్ చేసి, మళ్లీ కొత్త వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి.