వాట్సాప్ లో ఈ ఫీచర్ అదుర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్ లో ఈ ఫీచర్ అదుర్స్

June 30, 2017

వాట్సాప్ సరికొత్త ఆప్షన్ ను తీసుకొచ్చింది. టెక్స్ట్ సందేశాలు పంపుతున్నప్పుడు ఈమోజీలను సులభంగా వెదికేలా సెర్చ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆప్షన్‌తో.. ఇకపై ఈమోజీల కోసం అదే పనిగా స్క్రోలింగ్ చేయాల్సిన పనిలేదు. సెర్చ్ లోకి వెళ్లి ఏ గుర్తు టైప్ చేస్తే ఆ గుర్తు క్షణాల్లో కనిపిస్తుంది. బీటా వెర్షన్‌ 2.17.246లో ఈమోజీ సెర్చ్‌ ఆప్షన్ ఇప్పటికే యాక్టివేట్‌ కాగా… మిగతా వెర్షన్లలో కూడా త్వరలోనే దీన్ని రిలీజ్ చేయనుంది. ఇక ఇంతకుముందే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన వీడియో స్ట్రీమింగ్ ఆప్షన్… లేటెస్ట్ గా ఐఫోన్లలో కూడా అడుగుపెట్టింది. ఇక ఎప్పటినుంచో ఊరిస్తున్న రీకాల్ ఫీచర్‌ని కూడా త్వరలోనే విడుదల చేయనుంది.