వాట్సాప్ యూజర్స్ కు గుడ్ న్యూస్. ఇక అన్ని రకాల పైల్స్ పంపించే ఫీచర్లని తీసుకొచ్చిది. ఆండ్రాయిడ్, యాపిల్, విండోస్ వినియోగదారులకు ఈ కొత్త ఫీచర్లను అందించబోతోంది. ఎంపీ3, ఏపీకే వంటి ఇతర ఫైల్ ఫార్మాట్లను సైతం వాట్సాప్ సపోర్ట్ చేయనుంది. కంప్రెస్ చేయని హై క్వాలిటీ చిత్రాలను, వీడియోలను పంపించుకునే వెసులుబాటు కూడా కల్పించబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్లను వాట్సాప్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. కొన్ని దేశాల్లో ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ ఫీచర్లు ఇప్పటికే అందుబాటులోకివచ్చాయి. త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానున్నాయి.