వాకేశ్వర్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాకు పంపిన లేఖలో ఒకావిడ తన కుటుంబ సభ్యులను కాదని హీరో సంజయ్ దత్ కు తన ఆస్తిని, నగలను అందచేయాలని అభ్యర్థించింది.
అభిమానులంటే కటౌట్లు పెడుతారు. ఒకవేళ పుట్టినరోజులకు రక్తదానాలు, అన్నదానాలు చేస్తుంటారు. ఒక్కొక్కరి అభిమానం ఒక్కోలా చూపిస్తుంటారు. అలాగే ఒక ఆమె తన అభిమాన నటుడు సంజయ్ దత్ కు తన యావాదాస్తిని అతని పేరు మీద రాసి చనిపోయింది.
పరిశ్రమలో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నటుడు సంజయ్ దత్, హిందీ చిత్ర సీమలో ప్రముఖ నటుల్లో ఒకరిగా నిలిచిపోయారు. అతని తండ్రి సునీల్ దత్, తల్లి నర్గీస్ వారసత్వాన్ని ముందకు తీసుకుళ్లేందుకు 90లో బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. పొడవాటి జుట్టుతో స్టయిల్ ఐకాన్ గా మారిపోయాడు. అయితే ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నా ఒక అభిమానిని మాత్రం ఎప్పటికీ మరచిపోలేదు.
2108లో సంజయ్ దత్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నిషా పాటిల్ అనే వ్యక్తి గురించి. ఆమె అతనికి అపరిచితురాలు. ఆమె చనిపోయింది. ఆమె మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ ను అతనికి వదిలి పెట్టింది. 62 యేండ్ల నిషా పాటిల్ మలబార్ హిల్స్ నివాసి. ఆమె సంచయ్ దత్ అభిమాని. ఆమె అతనికి మొత్తంగా 72 కోట్ల ఆస్తిని సంజయ్ దత్ కు చెందాలని వీలునామా రాసింది. నిషా జనవరి 15, 2018న ప్రాణాంతక అనారోగ్యంతో పోరాడింది. ఆమెతో పాటు తన 80యేండ్ల తల్లి, తోబుట్టువులు ఉండేవారు. మొత్తానికి ఆ కుటుంబం సంజయ్ దత్ కి ఆస్తిని అప్పచెప్పారు. కానీ సంజయ్ దత్ మొత్తం డబ్బు, ఆస్తులను వారికే తిరిగి బదిలీ చేశాడు. ఈ మొత్తం కథ ఇప్పుడు మళ్లీ వైరలవుతున్నది.