మహిళను చంపిన ముదిరిన బెండకాయ - MicTv.in - Telugu News
mictv telugu

మహిళను చంపిన ముదిరిన బెండకాయ

February 10, 2018

కొన్నిసార్లు కొందరు వేసే ప్రశ్నలు భలే విసుగు తెప్పిస్తాయి. తెలియక అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పొచ్చు. కానీ తెలిసీ, కావాలని, ఏడిపించడానికి అడిగే ప్రశ్నలకు కొందరు కక్కలేకా, మింగలేకా జవాబు చెబుతారు. అయితే ఇండోనేషియాలోని ఓ యువకుడు ఓ పొరిగింటి ఆవిడ ఇబ్బందిపెట్టే ప్రశ్నను పదేపదే అడుగుతోందని గొంతునులిమి చేంపేశాడు. ఇంతకూ ఆ ప్రశ్న ఏమంటే.. ‘ఓయ్.. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్’ అని.ఫాయిజ్‌ కాంపుంగ్‌ పసిర్‌ జొంగ్‌ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల ఫాయిజ్‌ నుర్డిన్‌ ఇంకా పెళ్లి కాలేదు. ఆ ప్రాంతంలోనే అతడో వింత వ్యక్తిగా మారాడు. సాధారణంగా పాతికేళ్లకు పెళ్లిళ్లు చేసేస్తుంటారు అక్కడ. నుర్దిన్‌ను ఈ విషయంలో పొరిగింటి మహిళ ఐస్యా  సతాయించేంది. ఆమె గర్భవతి.‘రేపో మాపో 30 ఏళ్లు వస్తాయి. ఇంకేప్పుడు పెళ్లి చేసుకుంటావు?  నీ సావాసగాళ్లందరికీ పెళ్లిళ్లయి పిల్లలు పుట్టేశారు. నువ్వు ముదిరిపోయిన బెండకాయలా అయిపోతున్నావు.. నీకేమైనా సమస్య ఉందా? ఉంటే చెప్పు.. పరిష్కారం చూద్దాం.. మేమంతా లేమా? పిల్ల దొరకలేదా?  నీకు పెళ్లీపెటాకులా అక్కర్లేదా? సన్యాసం తీసుకుంటావా?’ అని ప్రశ్నలపైన ప్రశ్నలు కురిపించేది. నుర్దిన్ ఏదోలే పొద్దుపోక అడుగుతోందని పొడిపొడిగా బదులు చెప్పేసి వెళ్లిపోయేవాడు.

ఆయన ఆమె భేతాళుడిగా అతన్ని వేధిస్తూనే వస్తోంది. గతనెల 19న కూడా అతని ఇంటికి వచ్చి మళ్లీ ఈ యక్ష ప్రశ్న వేసింది. చిర్రెత్తుకొచ్చిన నుర్దీన్ కాసేపటి తర్వాత ఐస్యా ఇంటికెళ్లి ఆమెను చంపేశాడు. ఐష్యా వద్ద ఉన్న దాదాపు రూ. 4వేల  డబ్బును, మొబైల్‌ ఫోన్‌ను తీసుని దేశరాజధాని జకార్తాకు పారిపోయాడు .పోలీసులు తర్వాత అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచాడు. యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.