మావారు ‘గే’.. ఎవరు చెప్పారంటే  - MicTv.in - Telugu News
mictv telugu

మావారు ‘గే’.. ఎవరు చెప్పారంటే 

May 11, 2020

When Twinkle Khanna Had Revealed That Mother, Dimple Kapadia Thought Her Then-BF Akshay Kumar Is Gay

తన భర్త ‘గే’ అని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడి భార్య ట్వింకిల్​ ఖన్నాకు ఆమె తల్లి డింపుల్ కపాడియా చెప్పిందని ట్వింకిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తమ పెళ్లి ప్రస్తావన గురించి చర్చ వచ్చిన‌ప్పుడు డింపుల్ ఈ విషయాన్ని చెప్పిన‌ట్టు ట్వింకిల్​ తెలిపింది. ‘అక్షయ్,  నేను మా పెళ్లి గురించి మా అమ్మకు చెప్పాం. అక్షయ్​ వెళ్లిన తర్వాత నాకు అమ్మ నాకో మాట చెప్పాలంది. ఏంటని అడగగా.. తర్వాత చెప్తానని చెప్పింది. కానీ, నేను వెంట‌నే చెప్ప‌మ‌ని పోరాను. అప్పుడు చెప్పింది అక్షయ్​ గే అని. ఈ విషయం ఆమె ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని చెప్పింది. ఆ మాటతో నేను షాక్‌కి గురయ్యాను. పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాను’ అని ట్వింకిల్ తెలిపింది. 

ఈ క్రమంలో అప్పుడు డింపుల్ కపాడియా వీరిద్దరి పెళ్లికి ఓ షరతు విధించింది. వీరిద్దరూ ఒక ఏడాదిపాటు డేటింగ్ చేయాలని చెప్పింది. దీంతో వారిద్దరు సహజీవనం చేసిన సంవత్సరం తర్వాత 2001లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలున్నారు. లాక్​డౌన్ కారణంగా అక్షయ్ ఇప్పటికే పలుమార్లు విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే.