తండ్రి శవాన్ని వదిలి మ్యాచ్‌ కోసం వెళ్ళా..విరాట్ కోహ్లి - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి శవాన్ని వదిలి మ్యాచ్‌ కోసం వెళ్ళా..విరాట్ కోహ్లి

September 8, 2019

భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ స్టేడియంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది బ్యాటింగ్ అయినా ఫీల్డింగ్ అయినా కోహ్లీ దూకుడు ఒకే రకంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితిని అయినా తన మానసిక దృఢత్వంతో ఎదురుకుంటాడు. అయితే ఈ స్వభావానికి వెనక ఉన్న కారణాన్ని కోహ్లీ ఇటీవల ఇన్ డెప్త్ విత్ గ్రహం బెంసింగెర్‌ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యాత అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ..‘2006లో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో మా నాన్న చనిపోయారు. కర్ణాటకపై ఆరోజు 40 పరుగులు చేసి అజేయంగా క్రీజులో నిలిచాను. మరుసటి రోజు నేను ఎక్కువ సేపు బ్యాటింగ్ చేస్తే? ఢిల్లీ జట్టు ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. ఈ ఆలోచనలో ఇంటికి వెళ్లగా.. ఆరోజు అర్ధరాత్రి మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నా ముందే మా నాన్న తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులందరూ బోరున విలపిస్తున్నారు. కానీ..నాకు మాత్రం దుఃఖం రాలేదు. ఉదయం నా కోచ్ రాజ్‌ కుమార్ సార్‌కి ఫోన్ చేసి విషయం చెప్పి.. నేను మ్యాచ్‌‌ని ఆడాలకున్నట్లు చెప్పాను. అప్పుడే.. ఏ కారణంతోనూ క్రికెట్‌ని వదులుకోకూడదని బలంగా నిర్ణయించుకున్నా’ అని కోహ్లీ వెల్లడించాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.