కుశఫోటోలో ఎక్కడ ఉన్నాడు... - MicTv.in - Telugu News
mictv telugu

కుశఫోటోలో ఎక్కడ ఉన్నాడు…

August 29, 2017

బాబి డైరెక్షన్ లో ఎన్టీఆర్ త్రిప్రాత్రాభినయం చేస్తున్న మూవీ ‘జైలవకుశ’. ఈ మూవీకి సంబందించిన రెండు ట్రైలర్ల కు విశేష స్పందన వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ఇప్పుడు కుశ పాత్రని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫలిం సిటిలో జరుగుతోంది. దాదాపుగా 200 మంది డ్యాన్సర్ల మధ్యలో కుశ డ్యాన్స్ చేస్తున్న ఫోటోను ఎన్టీఆర్ ఆర్ట్స్ తన ట్వీటర్ లో పోస్టు చేస్తూ కుశ ని గుర్తు పట్టారా! అని ట్వీట్ చేసింది. ఈమూవీని ఎన్టీఆర్ బ్యానర్ పై నందమూరి కళ్యాన్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ల గా రాశీకన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా ప్రత్యేక గీతంలో నటిస్తోంది. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.