సాయి పల్లవి ఎక్కడుంది? సినిమాలు చేయటం లేదా?: ఫ్యాన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

సాయి పల్లవి ఎక్కడుంది? సినిమాలు చేయటం లేదా?: ఫ్యాన్స్

April 29, 2022

టాలీవుడ్‌లో హీరోయిన్ సాయి పల్లవి గురించి కొన్ని రోజులుగా ఓ చర్చ జరుగుతోంది. సాయి పల్లవి సినిమాలు చేయటం లేదా? ఆమె కొత్త సినిమాలు ఏవీ రావటం లేదు? సాయి పల్లవి ఎక్కడుంది? ఏం చేస్తోంది? ఎందుకు సినిమాలు చేయటం లేదు? అనే విషయాలపై ఇటు ఇండస్ట్రీలో, అటు సాయి పల్లవి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఆమె చివరిగా ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నటించారు. అప్పటినుంచి సినిమాలు చేయకపోవడంతో అభిమానులు ఆమె గురించి తెగ ఆరా తీస్తున్నారు. 2022వ సంవత్సరం మొదలై నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా ఆమె కొత్త సినిమాలు రాకపోవడంతో అభిమానులు నిరాశపడుతున్నారు.

సాయి పల్లవి ప్రస్తుతం ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడుపుతోందట. ఇక సినిమాల విషయానికొస్తే, ఆమె దగ్గరకు చాలా కథలు వస్తున్నాయట. కానీ, వచ్చిన ప్రతి కథలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత లేకపోవడంతో రిజెక్ట్ చేస్తోందట. అందుకే ఆమె ఇంటికే పరిమితమైందని, త్వరలో మంచి కథ వస్తే షూటింగ్ మొదలుపెట్టనున్నదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

సాయి పల్లవి టాలీవుడ్‌లోకి ‘ఫిదా’ సినిమాతో ఏంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘పడి పడి లేచే మనసు’, ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటింటిన ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధమైనా ఏవో బయటికి చెప్పని కారణాల వల్ల ఆగిపోయింది.