కొత్త సంవత్సరం అర్ధరాత్రి నుంచి ప్రారంభమవుతుంది. కానీ ప్రజలు అన్ని చోట్ల ఒకేసారి జరుపుకొంటారా? ఒక్కో దేశం ఒక్కో సమయంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.
ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని గంటల్లో 2022కి వీడ్కోలు పలుకుతున్నారు. కొత్త ఆశలతో, కొత్త వెలుగులతో 2023ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికే 2022కి కౌంట్ డౌన్ మొదలయింది. అయితే ఏ దేశం ముందుగా, ఏ దేశం చివరగా.. అసలు ఏఏ దేశాలు ఎప్పుడు కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తాయో చూడండి.
మొదటగా..
నూతన సంవత్సర వేడుకలను జరుపుకొనే మొదటి ప్రదేశం ఓషినియా. చిన్న పసిఫిక్ ద్వీప దేశాలైన టోంగా, సమోవా, కిరిబాటి నూతన సంవత్సరాన్ని మొదట స్వాగతించే దేశాలు. ఇక్కడ జనవరి 1 ఉదయం 10 am GMT లేదా 3:30 pm IST నుంచి డిసెంబర్ 31న ప్రారంభమవుతుంది.
చివరగా..
యునైటెడ్ స్టేట్స్ సమీపంలోని హౌలాండ్, బేకర్ దీవులు, జనావాసాలు లేని ద్వీపాలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికే చివరి ప్రదేశాలు. వారు కొత్త సంవత్సరంలో 12 pm GMT లేదా 5:30 pm IST జనవరి 1 న జరుపుతారు.
నూతన సంవత్సరం 2023
డిసెంబర్ 31 (GMT ప్రకారం):
న్యూజిల్యాండ్ : 10:15 am
ఆస్ట్రేలియా (చాలా ప్రాంతాల్లో..): 1 pm
జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా: 3 pm
చైనా, ఫిలిపైన్స్, సింగపూర్: 4 pm
బంగ్లాదేశ్ : 6 pm
నేపాల్ : 6:15 pm
ఇండియా, శ్రీలంక: 6:30 pm
పాకిస్తాన్: 7 pm
జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, స్పెయిన్ : 11 pm
యూకే, ఐర్లాండ్, ఐల్యాండ్, పోర్చుగల్ : 12 am
జనవరి 1 (GMT ప్రకారం):
బ్రెజిల్ (కొన్ని ప్రాంతాల్లో..): 2 am
అర్జెంటీనా, బ్రెజిల్ (కొన్ని ప్రాంతాల్లో..), చిలీ, పెరుగ్వే: 3 am
న్యూయార్క్, వాషింగ్టన్, డెట్రాయిట్: 5 am
చికాగో: 6 am
కొలరాడో, ఆరిజోనా: 7 am
నెవ్డా: 8 am
అలస్కా: 9 am
హవాయ్: 10 am
అమెరికన్ సమవో: 11 am
హౌల్యాండ్, బేకర్ ఐల్యాండ్స్: 12 pm