which movie is better in veera simha reddy waltair veerayya
mictv telugu

వాల్తేరు వీరయ్య ఎంట్రీతో.. వీరసింహారెడ్డి సీన్ రివర్స్..!

January 13, 2023

which movie is better in veera simha reddy waltair veerayya

టాలీవుడ్ లో 2023 సంక్రాంతి యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇండస్ట్రీ దిగ్గజాలు చిరంజీవి, బాలకృష్ణలు బాక్సాఫీస్ కథన రంగంలోకి దూకేశారు. నిన్న జనవరి 12న బాలయ్య వీరసింహారెడ్డి విడుదలవ్వగా.. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ అయిపోయింది. భారీ ప్రమోషన్స్, హైప్, క్రేజ్ తో.. చాలా ఏళ్ళ తరువాత బాలయ్య, చిరంజీవిలు సంక్రాంతి బరిలో పోటీ పడుతుండటంతో ఇండస్ట్రీలో తీవ్ర ఉత్కంఠ పరిణామాలు నెలకొన్నాయి. ఇప్పటికే మ్యూజిక్, టీజర్స్, ట్రైలర్, వ్యూస్ వార్ లో దాదాపు ఇద్దరు సమానంగా పోటీపడగా.. కలెక్షన్స్ ని ప్రభావితం చేసే రివ్యూస్, పబ్లిక్ టాక్ వంటి అసలు విషయంలో ఎవరి డామినేషన్ ఉంటుందో చూడాలి. అయితే నిన్న విడుదలైన వీరసింహారెడ్డి ఫ్లాప్ అని మాత్రం ఎక్కడ కూడా వినిపించలేదు. అభిమానులు, సినీ లవర్స్ అందరి నోటా నుండి బాలయ్య బీభత్సం, వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అని మాత్రమే టాక్ వచ్చింది. బాలయ్య డైలాగ్స్, గెటప్ పై ప్రశంసలు రాగా.. కథాంశం మూసగా ఉందని, సెకండ్ హాఫ్ కొంచం బోర్ అని ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందినట్టు రిపోర్ట్స్ అందుతున్నాయి.

అయితే సంక్రాంతి సీజన్, బాలయ్య మ్యాజిక్ తో ఈ నెగెటీవ్స్ ని అధిగమించి వీరసింహారెడ్డి సూపర్ హిట్ ఖాయమనే ధీమా నిన్న వ్యక్తం అవ్వగా.. ఈ రోజు వాల్తేరు వీరయ్య ఎంట్రీతో వీరసింహారెడ్డి సీన్ కాస్త రివర్స్ అయినట్టు వార్తలొస్తున్నాయి. వాల్తేరు వీరయ్యకి కూడా యూనానిమస్ హిట్ టాక్ వచ్చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవికి ఇదే అసలు సిసలు హిట్ అనే హైప్ క్రియేట్ అయిపోయింది. రివ్యూస్ కూడా వీరసింహారెడ్డి కంటే వీరయ్యకి బెటర్ గానే వస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని.. వీరయ్య కోసం ఫ్యామిలీస్ క్యూ కట్టడం ఖాయమని అంటున్నారు. రౌడీ అల్లుడు లోని వినోదం, ‘ముఠామేస్త్రి’లోని మాస్, శంకర్ దాదా లోని హీరోయిజం వీరయ్యలో కనిపిస్తుందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు వీరసింహారెడ్డి మాత్రం పూర్తిగా ఫ్యాన్స్ కోసం తీసిన చిత్రంగా చూస్తారు కానీ ఫ్యామిలీస్, కామెడీ లవర్స్ కి అంతగా ఎక్కదని.. కానీ వీరయ్యకి అన్ని రంగాల నుండి ఆదరణ వచ్చే అవకాశాలున్నట్టు క్రిటిక్స్ ఒకింత ఎడ్జ్ చిరంజీవికే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు సినిమాలకి హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ లో మాత్రం మెగా స్టార్ పైచేయి సాధించే ఛాన్సెస్ ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు క్రిటిక్స్.