Which Movie Trailer Is Good In Waltair Veerayya And Veera Simha Reddy
mictv telugu

భారీ వ్యూస్.. కానీ మ్యాటర్ వీక్.. ఆయనకీ ఓటమి తప్పదా ?

January 8, 2023

Which Movie Trailer Is Good In Waltair Veerayya And Veera Simha Reddy

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య నటసింహ నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డిల విడుదల తేదీలు దగ్గర పడుతుండటంతో.. మెగా నందమూరి అభిమానుల్లో జోష్ పెరిగిపోతుంది. బ్యానర్లు, కటౌట్స్ తో థియేటర్స్ దగ్గర అలంకరణలతో ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. దాంతో ఈ సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో భారీ వేడుక జరుగబోతోంది. అయితే ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కూడా చివరి దశకు చేరుకున్నాయి. గత నెలన్నర నుంచి పోస్టర్లు, టీజర్లు, పాటలు విడుదల చేసుకుంటూ వచ్చిన చిత్ర యూనిట్స్ ట్రైలర్స్ కూడా రిలీజ్ చేసేశాయి. చిత్ర విజయానికి ట్రైలర్ టాక్ చాలా ఇంపార్టెంట్. ట్రైలర్ టెంపో పట్టే మ్యాటర్ ఏంటో చెప్పేయొచ్చు. ట్రైలర్ ఆధారంగా మూవీ టాక్ డిసైడ్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి ట్రైలర్స్ ఒక్క రోజు గ్యాప్ లో యూట్యూబ్ లో రిలీజ్ అయాయ్యి. విడుదలైన 24గంటలకి వీరసింహా రెడ్డి ట్రైలర్ కి 10మిలియన్ వ్యూస్ రాగా.. ఈ రికార్డుని కేవలం 10గంటల్లోనే 10మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి చిరంజీవి తుడిచేసాడు. వీరయ్య ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తూ.. వీరసింహారెడ్డిపై ఆధిపత్యం కొనసాగిస్తున్నా.. నెగిటివ్ టాక్ కూడా అదే స్థాయిలో తెచ్చుకుంటుంది.

ఎలివేషన్స్ భారీగా ఉన్నా వీరయ్య ట్రైలర్ లో కంటెంట్ బలంగా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గ్రేస్, స్టైల్, మాస్, మ్యూజిక్ వంటి అంశాలతో వీరయ్యకి భారీ హైప్ వచ్చింది. కానీ కంటెంట్ బాలేకుంటే ఇవేవి పనిచేయవు. థియేటర్స్ లో టాక్ బలంగా ఉండాలంటే కంటెంట్ ఉండాల్సిందే. ఈ విషయంలో బాలకృష్ణ వీరసింహరెడ్డి ట్రైలర్ కి పాజిటివ్ స్పందన దక్కుతుంది. అన్నం ఉడికిందో లేదో.. ఒక్క మెతుకు పట్టుకుంటే చెప్పేసినట్టు.. ట్రైలర్ చూసి మూవీ ఎలా ఉండబోతుందో అంచనాలు వేసేవారు వీరసింహారెడ్డికే ఓటు వేస్తున్నారు. మాస్ ఆఫ్ గాడ్ పేరుకి ట్రైలర్ లో బాలయ్య న్యాయం చేశాడని అంటున్నారు. గోపీచంద్ టేకింగ్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. ఎలివేషన్స్ అన్ని కూడా జై బాలయ్య అనేట్టుగానే ఉన్నాయి. ముఖ్యంగా సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్‌లు.. బాలయ్య నోట నుంచి పదునెక్కిన కత్తుల్లా దూసుకుని వస్తుంటే.. ఆటోమేటిక్‌గా చప్పట్లు మోత మోగేట్టుగానే ఉంది.

ఇక దర్శకుడు గోపిచంద్ మలినేని బాలయ్య బాబు ఫ్యాన్ కావడంతో ఒక అభిమాని బాలయ్యని ఎలా చూడాలని కోరుకుంటాడో.. అలాగే తెరపై ఆవిష్కరించి సూపర్ సక్సెస్ అయ్యాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వీరసింహారెడ్డి విశ్వరూపం చూపించాడని అంటున్నారు. ఇక వీరయ్యలో చిరంజీవి మూస పద్దతిలో వెళ్లాడని.. అంత బాగానే ఉన్నా వావ్ అనిపించే హై మాత్రం వీరయ్య ట్రైలర్ ఇవ్వలేదని అంటున్నారు. ఇక పోలీస్ కమిషనర్ పాత్ర చేస్తున్న మాస్ మహారాజ రవితేజ కూడా ఆకట్టుకోలేకపోయాడని.. విక్రమ్ రాథోడ్ వంటి సీరియస్ నెస్ చూపెట్టకుండా ఇడియట్ మూవీ స్పూఫ్ చేసి కామెడీ చేసేశారని.. వీరయ్య ట్రైలర్ పై పెదవి విరుస్తున్నారు నెటిజన్స్. అయితే కొన్నిసార్లు లెక్క తప్పొచు. ట్రైలర్ వీక్ ఉండి.. హిట్ కొట్టిన సందర్భాలు తక్కువే అయినా.. నాట్ పాజిబుల్ మాత్రం కాదు.