Which Movies Are Releasing In Sankranthi 2023
mictv telugu

సంక్రాంతి బాక్సాఫీస్ ని బద్దలు చేయడానికి వస్తున్న చిత్రాలు ఇవే..!

January 9, 2023

Which Movies Are Releasing In Sankranthi 2023

సంక్రాంతి పండగ సీజన్ టాలీవుడ్ కి కాసుల వర్షం కురిపిస్తుంటుంది. ఫ్లాప్ సినిమాలు యావరేజ్ గా, యావరేజ్ లు సూపర్ హిట్స్ గా.. సూపర్ హిట్స్ ని బ్లాక్ బస్టర్స్ గా మలిచే సత్త సంక్రాంతి సీజన్ కి ఉంటుంది. అలాంటి సంక్రాంతి ఈ సారి రసవత్తర పోరుకి సిద్ధం కానుంది. టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణల మధ్య యుద్ధం ఈ సంక్రాంతికి హైలైట్ కానుంది. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి, వీరసింహారెడ్డిగా బాలకృష్ణలు సంక్రాంతి కదనరంగంలో ఉండగా.. తమిళన్ సూపర్ స్టార్స్ విజయ్ వారసుడు, అజిత్ తెగింపు కూడా బరిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో.. చిరంజీవి వర్సెస్ బాలకృష్ణలుగా పోటీ ఉంటే.. విజయ్ వర్సెస్ అజిత్ గా తమిళ చిత్ర పరిశ్రమలో పోటీ నెలకొంది. అయితే తెలుగులో కూడా విజయ్, అజిత్ కి మార్కెట్ ఉండటంతో తెలుగు సినిమాలకు ఈ డబ్బింగ్ చిత్రాలు కూడా పోటీ ఇవ్వనున్నాయి.

ఇక అగ్ర నిర్మాత, పెద్ద డిస్ట్రిబ్యూటర్ అని పేరున్న దిల్ రాజు నిర్మాణంలో వారసుడు తెరకెక్కింది. దాంతో స్ట్రైట్ తెలుగు సినిమాగా వారసుడిని దిల్ రాజు ప్రచారం చేస్తున్నాడు. నైజాం డిస్ట్రిబ్యూషన్ లో మంచి పట్టున్న దిల్ రాజు వారసుడిని భారీగా రిలీజ్ చేస్తున్నాడు. ఇక అజిత్ తునివు (తెలుగులో తేగింపు) సంక్రాంతి రేసులో ఉన్నా.. లేనట్టే అంటున్నారు. ఈ సినిమాకు తెలుగులో కానీ ఓవర్సీస్ మార్కెట్‌లో కానీ ఎలాంటి హైప్ లేదు. కాబట్టి స్పష్టంగా.. ఈ సంక్రాంతికి వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు బలమైన స్థితిలో ఉంటే.. అదృష్టవశాత్తు టాక్ కలిసొస్తే వారసుడు కూడా చిరు బాలయ్యలకి సవాల్ విసిరే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో సంక్రాంతి త్రిముఖ పోరు కానున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

హెచ్ వినోద్ దర్శకత్వంలో.. అజిత్ హీరోగా.. బ్యాంకు దోపిడీ నేపథ్యంలో తెరకెక్కిన ‘తెగింపు’.. తోలి సంక్రాంతి చిత్రంగా జనవరి 11న రిలీజ్ కానుంది. ఇక ఆ తరువాత.. వీరసింహారెడ్డి గర్జన మొదలు కానుంది. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో వీరసింహ రెడ్డి విడుదల అవ్వనుంది. మ్యూజిక్ లో వీరయ్య చిత్రంతో పోలిస్తే కాస్త వెనుకపడ్డా.. పవర్ ఫుల్ టైలర్ తో తిరిగి పుంజుకున్న బాలయ్యకి.. ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక జనవరి 13న మెగా మాస్ పార్టీ షురూ కానుంది. రవితేజతో చిరంజీవి చేస్తున్న మల్టీస్టారర్ వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ యావరేజ్ కలెక్షన్స్ తో కాస్త డీలా పడ్డ చిరు ఫ్యాన్స్ వీరయ్యపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. కాస్త టాక్ బాగున్నా సంక్రాంతికి వీరయ్య వీరంగం మాములుగా ఉండదని అంటున్నారు. ఇక ఆకారిగా విజయ్ వారసుడు జనవరి 14కి షిఫ్ట్ అయిపోయింది. నిజానికి జనవరి 12న విడుదల కావాల్సిన వారసుడు.. చిరంజీవి, బాలకృష్ణలకి పోటీ ఉండొద్దని పక్కకి జరిపినట్టు తాజాగా దిల్ రాజు ప్రకటించాడు.