పాత సంవత్సరానికి బైబై చెప్పి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు అంతా సిద్ధం అవుతున్నారు. మరి కొన్ని గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ వేడుకలు అన్ని చోట్ల ఒకేసారి చేసుకోలేరు. ఒకే దేశంలో ఒక్కో సమయానికి కొత్త సంవత్సరం అడుగుపెడుతుంది. గంటల తేడాతో కొత్త సంవత్సర వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంటాయి. మరి కొత్త సంత్సరం ముందుగా, చివరగా అడుగుపెట్టే దేశాలు ఏంటో తెలుసుకుందాం.
ఫస్ట్ అండ్ లాస్ట్ దేశాలు ఇవే.. :
నూతన సంవత్సరానికి పసిఫిక్ సముద్రంలోని టోంగా, సమోవా, కిరిబాటి లాంటి చిన్న దీవులతో పాటు న్యూజిలాండ్ దేశం ముందుగా స్వాగతం పలుకుతుంది. గ్రెగొరియన్ కేలండర్. ఛాధమ్ దీవుల్లో నూతన సంవత్సరం ముందుగా ప్రారంభం అవుతుంది. అన్ని దేశాల కంటే ముందుగా అర్ధరాత్రి 12 గంటలకు అక్కడ వేడుకలు ప్రారంభం అవుతాయి. చివరిగా అమెరికాలోని సమోవా దీవుల్లో న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటారు. ఇక్కడ వేడుకలు ప్రారంభం అయ్యే సమయానికి దాదాపు ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ముగింపు దశకు చేరుకుంటాయి.
రెండు దేశాల్లో న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పొచ్చు :
ఒకే వ్యక్తి రెండు దేశాల్లో న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పవచ్చు. అదెలా అంటే ముందుగా ఛాధమ్ దీవుల్లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని అక్కడి నుంచి 891 కిలో మీటర్ల దూరంలో ఉన్న సమోవా దీవులకు ప్లైట్ ద్వారా చేరుకొవచ్చు. కేవలం గంటన్నర ప్రయాణంలో ఆ దీవికి వెళ్లే అవకాశంఉంటుంది. కాబట్టి జనవరి 1వ తేదీ వచ్చే లోపు అక్కడికి చేరుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఒకే ఏడాదికి రెండు దేశాల్లో స్వాగతం పలికే అవకాశం దక్కుతుంది.