WHICH TEAM HAS ADVANTAGE IN PLAY OFF RACE
mictv telugu

సెమిస్ కు చేరేది ఎవరు? ఏ జట్లకు అవకాశం ఉంది?

November 4, 2022

టీ 20- 2022 ప్రపంచకప్ ఉత్కంఠ బరితంగా సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్‌కు సమీకరణాలు మారుతున్నాయి. హాట్ ఫేవరేట్ జట్లకు పసికూనలు షాక్ ఇస్తుండడంతో అంచనాలు తారుమారువుతున్నాయి. సూపర్ -12 చివర దశకు చేరుకున్న ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా సెమీస్ బెర్త్ కన్‌‌ఫామ్ చేసుకోకపోవడం పోరు ఎంత హోరాహోరీగా సాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఆటగాళ్లతో పాటు వరుణుడు కూడా గ్రౌండ్‌లో అడుగుపెడుతుండంతో ఫలితాలు అంతుచిక్కడం లేదు. ఒక్క బాల్ తో మ్యాచ్ స్వరూపాలు మారిపోతున్నాయి. ఇంకా 6 మ్యాచ్‌లే మిగిలే ఉండడంతో సెమీస్ రేసులో తీవ్ర పోటీ నెలకొంది. గ్రూప్-2 కంటే గ్రూప్ -1 లో సెమీస్ కు ఎవరు వస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

గ్రూప్ -1 లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య తీవ్ర పోటీ ఉంది. ఓ ఓటమి, ఓ మ్యాచ్ రద్దు కావడంతో తలో 5 పాయంట్లతో సమానంగా ఉన్నాయి. ఆ జట్ల చివరి మ్యాచ్ లో గెలిస్తే మెరుగైనా రన్ రేట్ కలిగిన రెండు జట్లు సెమీస్‌కు దూసుకెళ్తాయి.. శుక్రవారం ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ గెలిస్తే ఎవరి ఫలితాలపై ఆధారపడకుండా సెమీస్‌కు పోతుంది.ఇక ఆసీస్ తన చివరి మ్యాచ్ ఆఫ్గాన్‌పై ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించినా సెమీస్ బెర్తు కన్ ఫామ్ కాని పరిస్థితి. నెట్‌రన్ రేట్ తక్కువ ఉండడంతో ఇంగ్లాండ్, శ్రీలంక మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడక తప్పదు. ఇక శ్రీలంకపై ఇంగ్లాండ్ విజయం సాధించి..ఆసీస్ రన్‌రేట్ కంటే ఎక్కువ ఉంటే సెమీస్‌కు పోతుంది. ఇంగ్లాడ్‌పై శ్రీలంక గెలిస్తే టెక్నికల్‌గా సెమీస్ రేసులో ముందుకు వస్తుంది. ఐతే ఐర్లాండ్ పై న్యూజిలాండ్ లేదా ఆఫ్గాన్‌‌పై ఆసీస్ ఓడితే శ్రీలంకకు ఛాన్స్ వస్తుంది..

గ్రూప్ 2 సెమీస్ కు చేరే అవకాశాలు ఇండియా, సౌతాఫ్రికాకు మెండుగా ఉన్నాయి. ఆయా జట్లు తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే ఎటువంటి సమీకరణాలపై ఆధారపడకుండా నేరుగా సెమీస్‌కు చేరుతాయి.. పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలవాలంటే తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై తప్పనిసరిగా గెలవాలి. రన్‌రేట్ మెరుగయ్యేలా ఈ గెలుపు ఉండాలి. అంతేకాకుండా సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓడినా.. వర్షంతో రద్దయినా పాకిస్థాన్ సెమీస్ చేరుతోంది. సౌతాఫ్రికా ఇంటిదారి పడుతోంది. సౌతాఫ్రికా నెట్ రన్‌రేట్ కంటే పాకిస్థాన్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక జింబాబ్వే చేతిలో భారత్ ఓడినా పాకిస్థాన్‌కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. ఎందుకంటే భారత్ కంటే పాకిస్థాన్‌కే మెరుగైన రన్‌రేట్ ఉంది.