అయ్యో కాశయ్యా.. ఫుల్ బాటిల్ తాగలేక మృతి - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యో కాశయ్యా.. ఫుల్ బాటిల్ తాగలేక మృతి

January 10, 2020

Nizamabad.

మందులో నీళ్లు కలుపుకుని నెమ్మదిగా తాగితేనే ఎక్కుతుంది. దానిని వేగంగా తాగితే ప్రాణానికే ప్రమాదమని అందరికీ  తెలిసిన విషయమే. నీళ్లు, సోడా వంటివి కలుపుకోకుండా పచ్చి మందు తాగితే ప్రాణాలే పోతాయి. 

నీళ్లు కలపని ఫుల్ బాటిల్ విస్కీని అరగంటలో  తాగుతానని పందెం అతడు కాశాడు. అసలే అది హార్డ్ మందు.  గొంతులో దిగేటప్పుడు గుండెలో ఎంత మంట రేపుతుందో తెలిసిందే. అయినా తెలిసీ తెలిసీ పందెం కాశాడు. ఘాటు తట్టుకోలేక చనిపోయాడు. నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలం కోసంగి కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. 

కాశయ్య అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. పార్టీలో అరగంట సమయంలో ఫుల్ బాటిల్ విస్కీ ఎత్తిన సీసా దించకుండా తాగుతే వెయ్యి రూపాయలు ఇస్తామని స్నేహితులు పందెం కాశారు. ఆ వెయ్యి రూపాయలకు ఆశపడ్డ కాశయ్య ఫుల్ బాటిల్ పచ్చి మందుని క్షణాల్లోనే గటగటా తాగేశాడు. మందు తాగేశాక అక్కడే కుప్పకూలి పడిపోయి ప్రాణాలు వదిలాడు. భయాందోళనకు గురైన స్నేహితులు కాశయ్య మృతదేహాన్ని అతని ఇంటివద్ద వదిలేసి వెళ్లిపోయారు. వెయ్యి రూపాయల కోసం ప్రాణాలు తీసుకున్నాడని కాశయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.