ఆస్తులపై శ్వేతపత్రం ఇవ్వాలి.. టీటీడీ కీలక నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్తులపై శ్వేతపత్రం ఇవ్వాలి.. టీటీడీ కీలక నిర్ణయం

May 28, 2020

hgf

తిరుమల ఆస్తులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆస్తుల మీద వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. టీటీడీ భూములు ఇంచు కూడా ఆక్రమణకు గురి కాకూడదని అన్నారు. గతంలో వివిధ దశల్లో విక్రయించినవి, దురాక్రమణకు గురైన భూముల వివరాలు శ్వేతపత్రంలో ఉండాలని స్పష్టంచేశారు. 

అంతేగాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి, దురాక్రమణకు గురైనవి స్వాధీనం చేసుకున్నవన్నీ అందులో పొందుపరచాలని తెలిపింది. 2016 నుంచి అప్పటి పాలక మండలి విక్రయాల మీద ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలంటూ లేఖ వ్రాయాలని టీటీడీ అధికారుల‌ను ఆదేశించారు. కాగా, టీటీడీ పాల‌క‌మండలి కీల‌క స‌మావేశం నేడు వీడియో కాన్షరెన్స్‌లో నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా టీటీడీ భూములు విక్ర‌యించ‌రాద‌ని తీర్మానం చేసింది.