తెలంగాణ..33 జిల్లాల కొత్త జడ్జీలు వీరే.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ..33 జిల్లాల కొత్త జడ్జీలు వీరే..

June 1, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లా కేంద్రంలో కొత్త కోర్టుల ఏర్పాటుకు ప్రకటన విడుదల చేసింది. కొత్త కోర్టులకు జడ్జిలతోపాటు సిబ్బందిని కూడా సర్దుబాటు చేస్తూ, నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త కోర్టుల భవనాలను సైతం పూర్తిస్థాయిలో సమకూర్చనున్నట్లు తెలిపింది.

హైకోర్టు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ‘జూన్ 2వ తేదీ (గురువారం) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కొత్త కోర్టులు అన్నీ ప్రారంభంకానున్నాయి. తొలుత కోర్టులకు వేసవి సెలవులు జూన్ 3వ తేదీ వరకు ఉండేలా షెడ్యూలు తయారుచేసినా, హైకోర్టు రిజిస్టార్ జనరల్ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి, సెలవులను మే 31 వరకు మాత్రమే కుదించుకోవాలని సూచించారు. జూన్ 1న జడ్జిలతో సహా సిబ్బంది అంతా విధులకు హాజరుకావాల్సిందేనని చెప్పారు. పాత జిల్లాలతో కలిపి మొత్తం 33 జిల్లా కోర్టులు ఏర్పాటైనందున ఆరుగురు హైకోర్టు జడ్జిలకు (సంగారెడ్డి, మెదక్ జస్టిస్‌పై శ్రీదేవి, మహబూబ్‌నగర్, నారాయణపేట జస్టిస్ టి.వినోద్ కుమార్, హన్మకొండ, జనగాం జస్టిస్ అభిషేక్ రెడ్డి, వరంగల్, మహబూబాబాద్ జస్టిస్ కె. లక్ష్మణన్, నిర్మల్, ఆసిఫాబాద్ జస్టిస్ ఎం లక్ష్మణ్, ములుగు, భూపాలపల్లి జస్టిస్ శ్రావణ్ కుమార్) రెండేసి జిల్లాల చొప్పున పర్యవేక్షణ బాధ్యతలు ఇవ్వగా, మిగిలిన 21 మంది హైకోర్టు జడ్జిలకు ఒక్కొక్క జిల్లాను అప్పగించారు.’

33 జిల్లాల కొత్త జడ్జీలు వీరే..